AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naatu Naatu: నాటు నాటుకు పోటీకొస్తున్న మిగతా నాలుగు పాటలేంటి… వాటికున్న సత్తా ఎంత? మీరే విని చెప్పండి

ట్రిపులార్... టాలీవుడ్‌లో పుట్టి హాలీవుడ్‌ దాకా మెప్పించిన విజువల్ వండర్. థిమాటిక్ థండర్ కూడా. కానీ... ఇండియన్ అఫీషియల్ ఎంట్రీకి నోచుకోలేకపోయింది. మరో మార్గం లేక ఇండివిడ్యువల్ ఎంట్రీ వైపు చూసింది. ఇప్పుడా కేటగిరిలో నెగ్గి రావడం కూడా అంత ఈజీ కాదా...? నాటునాటు పాటకు పోటీకొస్తున్న మిగతా నాలుగు పాటలేంటి... వాటికున్న సత్తా ఎంత?

Naatu Naatu: నాటు నాటుకు పోటీకొస్తున్న మిగతా నాలుగు పాటలేంటి... వాటికున్న సత్తా ఎంత?  మీరే విని చెప్పండి
Nt Rama Rao - Ram Charan
Ram Naramaneni
|

Updated on: Mar 12, 2023 | 3:57 PM

Share

దేశం తిరస్కరించినా… తానే పూనుకుని తన సినిమాను ఆస్కార్ వేటలో నిలబెట్టింది జక్కన్న టీమ్. ఎత్తర జెండా అంటూ 14 కేటగిరీల్లో అప్లయ్ చేస్తే ఒరిజినల్ సాంగ్ కేటగిరీకి మాత్రమే నామినేషన్ దొరికింది. ఆవిధంగా ఆస్కార్ రేసులో నిలబడింది నాటునాటు పాట. అకాడమీ అవార్డ్స్ కోసం ఈసారి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 81 పాటలు ఎలిజిబిలిటీ సాధించాయి. వాటిని గట్టిగా జల్లెడ పడితే ఫస్ట్ రౌండ్‌లో 15 పాటలు మిగిలాయి. ఆ తర్వాత రౌండ్‌లో పది పాటలు పక్కకెళ్లిపోయి.. ఫైనల్‌ రేసులో టాప్‌ ఫైవ్ ఒరిజినల్ సాంగ్స్ మిగిలాయి. మరి… నాటునాటుకి పాటకు పోటీనిచ్చే మిగతా నాలుగు పాటలేంటి… వాటికున్న సత్తాలేంటి?

అమెరికన్ మూవీ ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్’… ఇందులోంచి సోఫియా కార్సన్ పెర్ఫామ్ చేసిన అప్లాజ్ అనే పాట… ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మెయిన్ స్ట్రీమ్‌లో ఉంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే బీటౌన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించడం.

మరో పాట  అమెరికన్ యాక్షన్ డ్రామా టాప్‌గన్ మావెరిక్‌లో… హోల్ట్ మై హ్యాండ్. లవ్ అండ్ వార్ థీమ్‌తో సాగే ఈ పాటను యూఎస్ పాపులర్‌ సింగర్ లేడీ గాగా రాసి పాడారు.

ఇక… అమెరికన్ సూపర్‌ హీరో ఫిలిమ్‌ బ్లాక్ పాంథర్‌లోంచి Lift Me Up అనే మెలోడియస్ సాంగ్.

చివర్లో THIS IS A LIFE…! గత వారంలోనే ఇటీవలే 29th యాన్యువల్ సాగ్ అవార్డ్‌ను సొంతం చేసుకున్న ఈ పాట… Everything Everywhere All at once అనే అమెరికన్ సిల్లీ కామెడీ డ్రామాలోనిది. నాలుగు పాటల్లోకీ కాస్త మేజిక్కున్నట్టు కనిపించే పాట ఇదొక్కటే.

సో.. నాలుగు అమెరికన్ పాపులర్ సాంగ్స్‌తో ఫైటింగ్ చెయ్యబోతోంది మన నాటునాటు పాట. మాంచి జోషున్న ట్యూను… పైగా బ్రిటిష్ కంటెంటున్న పాట. యూనిక్ థీమ్‌తో ఏ2జెడ్ ఫుట్‌ట్యాపింగ్‌తో సాగే పాట. ఇన్ని క్వాలిటీలుండబట్టే… టాప్‌5 దాకా చేరుకుంది మన మిరప ఘాటు పాట. మరి… ఫైనల్ రౌండ్ కూడా ఫినిష్ చేసుకుని… వెస్టర్న్ మ్యూజిక్‌ని కూడా ఓడగొట్టే సత్తా మన నాటు పాటకుందా లేదా… అనేది కొన్ని గంటల్లోనే తేలిపోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..