
తెలంగాణ నుంచి ఏపీ వరకు రెండు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ల వివాదం నానుతూనే ఉంది. ఎవరికి వారు మాటలు తూటాల్లో పేల్చుతున్నారు. ఏపీలో థియేటర్లలో తనిఖీలు, నిబంధనలు పాటించని వాటి సీజ్ కొనసాగుతోంది. కొన్ని థియేటర్ల యాజమానులు స్వచ్ఛందంగా తాళాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాజమండ్రిలో ఏపీ సినిమా థియేటర్ల యజమానుల అసోసియేషన్ సమావేశం కాబోతుంది. ఈ వివాదంపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ క్రమంలో మరోసారి స్పందించారు హీరో నాని. వకీల్‌సాబ్ సినిమా విడుదల సమయంలోనూ థియేటర్ల సమస్య వచ్చిందన్న నాని.. అప్పుడే ఇండస్ట్రీ అంతా కలిసి పోరాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ లో ఐక్యత లేదని అన్నారు. అందరూ ఒకే తాటి పై ఉంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేదని అన్నారు.
సరిగ్గా చెప్పి ఉంటే.. అధికారులు కూడా ఆలోచించి ఉండేవారేమోనని నాని అభిప్రాయపడ్డారు. మరోవైపు నాలుగు రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను ఒక్కొక్కొరు ఒక్కో విధంగా అర్థం చేసుకున్నారన్నారు. సోషల్ మీడియాలో దానిపై ఒక్కో విధంగా ట్రోల్ చేశారంటూ నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య థియేటర్ల మీద నాని చేసిన కామెంట్ సంచలనం రేపాయి. థియేటర్లలో వచ్చే వసూళ్ల కంటే, కిరాణకొట్టులో వచ్చే రోజువారి కలెక్షన్స్ ఎక్కువని నాని కామెంట్ చేశారు. ఇది తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు మరోసారి థియేటర్లపై కామెంట్ చేశారు నాని.
Also Read: చిరకట్టులో చామంతి.. ఓణీలో పూబంతి..’పదహారణాల తెలుగమ్మాయి’ ఈ హీరోయిన్.. గుర్తుపట్టారా..?
ఈ ఏడాది ట్రాఫిక్ చలనాల రూపంలో సర్కారీ ఖజానాకు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మతి పోతుంది..