విశాల్ తన సినిమాలు చాలా వేగంగా పూర్తిచేస్తాడు. ఓ సినిమా అనౌన్స్ చేస్తాడు.. ఆ తర్వత నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసేలోగానే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడు. తాజాగా ఎనిమీ అనే సినిమాను పూర్తి చేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ కెరీర్ లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి ‘నోటా’ ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరో ఆర్య కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. తాజాగా ‘ఎనిమీ’ చిత్రానికి సంబంధించిన తెలుగు తమిళ హిందీ టీజర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.
టీజర్ విషయానికొస్తే.. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీగా ఆర్య కనిపిస్తోంటే.. అతన్ని పట్టుకోవాలని చూసే పోలీస్ ఆఫీసర్ గా విశాల్ కనిపిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఫైట్ సీన్స్.. భారీ యాక్షన్ సీక్వెన్సులు – ఛేజింగ్ సన్నివేశాలతో నిండిన ఈ టీజర్ ఆకట్టుకొంటోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో సీనియర్ నటి ఖుష్బూ నటిస్తోన్నారు. అలాగే ప్రకాష్ రాజ్ మరో ముఖ్య పాత్ర పోషించారు. టీజర్ లో ‘ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే’ అని ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :