Producer SKN: పోలీసులను ఆశ్రయించిన ‘ది రాజాసాబ్’ నిర్మాత ఎస్కేఎన్.. ఏం జరిగిందంటే?

మాస్ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థను స్థాపించి పలు వరుసగా సినిమాలను రూపొందిస్తున్నారు నిర్మాత ఎస్కేఎన్. ఆ మధ్యన బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఈ సంక్రాంతికి ది రాజాసాబ్ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.

Producer SKN: పోలీసులను ఆశ్రయించిన ది రాజాసాబ్ నిర్మాత ఎస్కేఎన్.. ఏం జరిగిందంటే?
The Raja Saab Producer SKN

Updated on: Jan 25, 2026 | 7:30 AM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అలియాస్ శ్రీనివాస్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మాస్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై టాక్సీవాలా, రొమాన్స్,మంచీ రోజులుచ్చాయ్, 3 రోజెస్, బేబీ వంటి సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతుకు మందు ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే వంటి సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు ఎస్కేఎన్. ఇక ఇటీవలే ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో ముందుకొచ్చారీ స్టార్ ప్రొడ్యూసర్. ఇదిలా ఉంటే సినిమా ఈవెంట్లలో తన ఉపన్యాసాలు, కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ఎస్కేఎన్. ఒక్కోసారి తన కామెంట్స్ తో ట్రోలింగ్, విమర్శలు కూడా ఎదుర్కొంటుంటారు. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ సినిమా ఫెయిల్యూర్ విషయంలో కొందరు ఎస్కేఎన్ ను తప్పుపడుతున్నారు. ది రాజా సాబ్ సినిమా విడుదలకు ముందు ఈయన సినిమా పట్ల పెద్ద ఎత్తున గొప్పలు చెబుతూ ప్రమోషన్లు నిర్వహించారని, అయితే తీరా సినిమా విడుదలయ్యాక పూర్తి నెగెటివిటీ వచ్చిందని కొందరు సోషల్ మీడియాలో ఎస్కేఎన్ ను ట్రోల్ చేస్తున్నారు.దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై విమర్శలు చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చేశారు.

సంక్రాంతి కానుకగా జనవరి 09న విడుదలైన ది రాజసాబ్ సినిమా ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. మారుతి తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ కామెడీ మూవీలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉంది. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు ప్రభాస్ తో రొమాన్స్ చేశారు. అలాగే సంజయ్ దత్, సముద్రఖని, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్ లాంటి స్టార్స్ కూడా ఈమూవీలో భాగమయ్యారు. ఇంత మంది ఉన్నప్పటికీ ది రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ మూవీకి సుమారు రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.