Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆదిపురుష్ ఇంటర్వెల్ సీన్ ఇలా ఉండబోతుందట..
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మైథలాజికల్ డ్రామాలో డార్లింగ్ రాముడిగా కనిపిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ నటించిన లాస్ట్ సినిమా రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆయన నెక్స్ట్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మైథలాజికల్ డ్రామాలో డార్లింగ్ రాముడిగా కనిపిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇక ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్వెల్ సీన్ లో ప్రభాస్ రాక్షసులతో యుద్ధం చేస్తాడని ఆ యుద్ధం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని టాక్ మరి ఈ వార్తలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాను దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేతిలో మరన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
