Thalapathy vijay: దళపతి విజయ్-లోకేష్ సినిమాలో భారీ స్టార్ కాస్ట్.. ఎవరెవరిని ఎంపిక చేశారంటే
దళపతి విజయ్ రీసెంట్ గా వారసుడు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటించింది. ముందుగా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను ఆ టాక్ కాస్త పాజిటివ్ అయ్యింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ నటన, డాన్స్ ప్రేక్షకులను అక్కట్టుకున్నాయి. దిల్ రాజు నిర్మించిన ఈ […]

దళపతి విజయ్ రీసెంట్ గా వారసుడు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటించింది. ముందుగా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను ఆ టాక్ కాస్త పాజిటివ్ అయ్యింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ నటన, డాన్స్ ప్రేక్షకులను అక్కట్టుకున్నాయి. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ 100కోట్ల మార్క్ ను దాటి కలెక్షన్స్ వసూల్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు దళపతి నెక్స్ట్ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. విజయ్ నెక్స్ట్ సినిమా లోకేష్ కనకరాజ్ తో చేస్తున్నారు. ఇటీవలే లోకేష్ కమల్ హాసన్ తో కలిసి విక్రమ్ సినిమా చేశాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు విజయ్ తో సినిమా చేస్తున్నాడు లోకేష్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మాస్టర్ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో సినిమా రానుందని ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో కీ రోల్ లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించనున్నాడు అని తెలుస్తోంది. హీరోయిన్ గా త్రిషను ఇప్పటికే కన్ఫర్మ్ చేయగా.. మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. మెయిన్ విలన్ గా సంజయ్ దత్ ని లాక్ చేశారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారట. మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ లను కూడా తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రటకటన రానుంది.