కోలీవుడ్ ఇండస్ట్రీలో తమ అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం సహజమే. సోషల్ మీడియాలోనే కాకుండా నేరుగా థియేటర్ల వద్దే గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కేవలం సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగత జీవితం గురించి కూడా ఇరువురి ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా తమిళ్ చిత్రపరిశ్రమలో అజిత్ కుమార్.. విజయ్ దళపతి మధ్య వార్ జరుగుతుంటుంది. వీరిద్దరి అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే కాలిపోయే రేంజ్లో వివాదాలు నెలకొంటుంటాయి. గతంలో అనేకసార్లు వీరి ఫ్యాన్స్ మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాటలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద ఈ ఇద్దరు హీరోస్ తలపడనున్నారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత వీరి సినిమాలు ఓకే రోజు విడుదల కాబోతున్నాయి. దీంతో ఇప్పటి నెట్టింట వార్ షురు చేశారు ఫ్యాన్స్.
ఇటీవల వాలిమై చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న అజిత్.. ప్రస్తుతం తునీవు చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇటీవల ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు బోనీ కపూర్.
మరోవైపు దళపతి విజయ్ నటించిన వారిసు కూడా ఇదే సందర్భంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా ధృవీకరించింది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నటి రష్మిక మందన్న కథానాయికగా నటించింది. దీంతో ఇప్పుడే ఫ్యాన్స్ ట్విట్టర్ వార్ షురు చేశారు. అజిత్, విజయ్ సినిమాల మధ్య గొడవలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2014లో విజయ్ ‘జిల్లా’, అజిత్ ‘వీరం’ కలిసి విడుదలయ్యాయి. ఈ సమయంలో ‘వీరమ్’ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ‘జిల్లా’ కొంచెం ఆడంబరం తగ్గింది. ఈ సందర్భంగా అజిత్ అభిమానుల పండుగ చేసుకున్నారు. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత వీరిద్దరూ ముఖాముఖిగా వస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మొదలైంది. ఈ రేసులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరం.
#ThunivuPongal #Thunivu #NoGutsNoGlory#Ajithkumar #HVinoth @ZeeStudios_ @Udhaystalin @BayViewProjOffl @RedGiantMovies_ @Kalaignartv_off @NetflixIndia #RomeoPictures @mynameisraahul @SureshChandraa #NiravShah @GhibranOfficial #Milan @SupremeSundar_ @editorvijay pic.twitter.com/G3NBbbibiH
— Boney Kapoor (@BoneyKapoor) October 28, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.