Thalapathy Vijay’s Beast: సోషల్ మీడియాను షేక్ ఆడిస్తున్న బీస్ట్ అరబికుత్తు సాంగ్..
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

Thalapathy Vijay’s Beast: దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్ (Beast). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దళపతి విజయ్(Thalapathy Vijay) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను సాధిస్తుంటాయ్. గత కొంతకాలంగా విజయ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.. ప్రతి సినిమా 100కోట్ల మార్క్ ను చాలా సింపుల్ గా క్రాస్ చేసేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు విజయ్ బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
బీస్ట్ మూవీ యూనిట్ తాజాగా సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. వాలంటైన్స్‌డేను పురస్కరించుకొని బీస్ట్ సినిమాలోని ‘అరబికుత్తు’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ‘అరబికుత్తు’ సాంగ్ రిలీజ్ చేసిన 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధికమంది వీక్షకులు వీక్షించిన పాటగా రికార్డు సృష్టించింది. 2.5 కోట్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇక ఇప్పుడు ఈసాంగ్ 47 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను టచ్ చేయనుంది. ఈ పాటలో విజయ్ , పూజ స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చాలా కాలం తర్వాత తమిళ్ లో నటిస్తుంది పూజ హెగ్డే.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు.