varisu Box office collection: వారం రోజుల్లోనే దాటేసిన వారసుడు.. 210 కోట్ల క్లబ్‌లోకి చేరిన దళపతి సినిమా..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వారసుడు సినిమా తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తమిళనాడులో జనవరి 11న విడుదలైంది.

varisu Box office collection: వారం రోజుల్లోనే దాటేసిన వారసుడు.. 210 కోట్ల క్లబ్‌లోకి చేరిన దళపతి సినిమా..
Varisu Movie

Updated on: Jan 18, 2023 | 4:50 PM

దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు విజయ్. దళపతి సినిమాలు అవలీలగా 100కోట్లు మార్క్ ను కొల్లగొడుతున్నారు. తాజాగా విజయ్ వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వారసుడు సినిమా తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తమిళనాడులో జనవరి 11న విడుదలైంది. తెలుగులో జనవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

వారసుడు సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక వారసుడు సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు దాటింది. సంక్రాంతి తెలుగులో భారీ పోటీ ఉన్నప్పటికీ వారసుడు సినిమా బాగానే నెట్టుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమా 7 రోజులకు 150కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 210కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత విజయ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారసుడు సినిమాతో దళపతి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.