దళపతి విజయ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ దళపతి సినిమాలు విడుదలై భారీ హిట్స్ అందుకుంటున్నాయి. తెలుగులో విజయ్‌కు మంచి మార్కెట్ ఉంది. విజయ్ సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య విడుదలైన విజయ్ సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. చివరిగా విజయ్ నటించిన లియో సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ హిట్ దళపతి ఫ్యాన్స్ కు సరిపోలేదు. దాంతో ఇప్పుడు విజయ్ నటిస్తున్న గోట్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వెంకట్ ప్రభు.
ఈ సినిమాలో సీనియర్ హీరో ప్రశాంత్ , అలాగే ప్రభుదేవా కూడా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దళపతి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. తండ్రి కొడుకులుగా విజయ్ కనిపించనున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు సెప్టెంబర్ 5న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ ఉండనుందని తెలుస్తోంది.
గోట్ సినిమాలో స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిఫరెన్సులు ఫుల్‌గా ఉన్నాయి. ఇదే విషయాన్నీ దర్శకుడు వెంకట్ ప్రభు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ధోని కూడా కనిపిస్తాడని కోలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. అలాగే హీరో విజయ్‌తో ధోని కలిసున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోని అభిమానులు, దళపతి ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం గోట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
is ms dhoni acting in vijay’s GOAT movie?#MSDhoni𓃵 #VijayThalapathy #GOATTheMovie pic.twitter.com/UR9QAUbBZv
— Sayyad Nag Pasha (@nag_pasha) August 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.