AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy vijay : జక్కన్న బాటలో దళపతి విజయ్.. ఆ సూపర్ హిట్ సినిమా కూడా జపాన్‌లో రిలీజ్ కానుందా..?

ఇండియన్ సినిమాకు ఓవర్‌ సీస్‌లోనూ మంచి మార్కెట్ కనిపిస్తోంది. గతంలో బాహుబలి, దంగల్ లాంటి సినిమాలు చైనా మార్కెట్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. ఆ వసూళ్ల కారణంగానే ఈ సినిమాలు 2000 కోట్ల మార్క్‌ను రీచ్ అవ్వగలిగాయి.

Thalapathy vijay : జక్కన్న బాటలో దళపతి విజయ్.. ఆ సూపర్ హిట్ సినిమా కూడా జపాన్‌లో రిలీజ్ కానుందా..?
Thalapathi Vijay
Rajeev Rayala
|

Updated on: Nov 01, 2022 | 4:51 PM

Share

మన సినిమా రీజినల్‌ మార్కెట్‌ను దాటి ఆల్రెడీ ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్‌లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు చిన్న పెద్ద అన్న తేడా లేదు. దాదాపు అన్ని సినిమాలు నేషనల్‌ రిలీజ్‌ను టార్గెట్ చేస్తున్నాయి. దీంతో టాప్‌ స్టార్స్‌ తమ పరిధిని మరింత పెంచుకునే పనిలో పడ్డారు. విదేశాల్లోనూ మార్కెట్‌ క్రియేట్ చేసుకునేందుకు బిగ్ స్కెచ్ వేస్తున్నారు. ఇండియన్ సినిమాకు ఓవర్‌ సీస్‌లోనూ మంచి మార్కెట్ కనిపిస్తోంది. గతంలో బాహుబలి, దంగల్ లాంటి సినిమాలు చైనా మార్కెట్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. ఆ వసూళ్ల కారణంగానే ఈ సినిమాలు 2000 కోట్ల మార్క్‌ను రీచ్ అవ్వగలిగాయి. అందుకే ఇప్పుడు విదేశీ మార్కెట్ మీద కూడా సీరియస్‌గా ఫోకస్‌ చేస్తున్నారు మన మేకర్స్‌.

లేటెస్ట్‌గా ట్రిపులార్ సినిమా కూడా ఓవర్‌ సీస్‌లో గట్టిగా సౌండ్ చేస్తోంది. జపాన్ రిలీజ్‌ను సీరియస్‌గా తీసుకున్న ట్రిపులార్ మేకర్స్… భారీగా ప్రమోట్‌ చేశారు. దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని జపాన్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో టాప్ హీరో ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్నాళ్లు కోలీవుడ్ మార్కెట్‌కే ఫిక్స్ అయిన దళపతి విజయ్‌ ఇప్పుడిప్పుడే మార్కెట్‌ ఎక్స్‌పాన్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు. వరుసగా తన సినిమాలను పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ చేస్తున్న విజయ్‌… ఇప్పుడు అదర్‌ కంట్రీస్‌లోనూ బిగ్ రిలీజ్ మీద దృష్టి పెట్టారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా మాస్టర్. తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏదో మొక్కుబడిగా డబ్ చేసి రిలీజ్ చేయటం కాకుండా… ప్రమోషన్ విషయంలోనూ సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. హీరో విజయ్‌ని ప్రమోషన్‌ కోసం జపాన్‌ తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు మేకర్స్‌. మరి స్కెచ్‌ విజయ్‌ ఇమేజ్‌కు ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు