Puneeth Rajkumar: అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన పవర్ స్టార్‌కు కర్ణాటక రత్న అవార్డు.. అతిథులుగా రజినీకాంత్, తారక్

Puneeth Rajkumar: అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన పవర్ స్టార్‌కు కర్ణాటక రత్న అవార్డు.. అతిథులుగా రజినీకాంత్, తారక్

Rajeev Rayala

|

Updated on: Nov 01, 2022 | 5:14 PM

కన్నడ  సూపర్ స్టార్ దివంగత రాజ్‌కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్. బాలనటుడి గా అనేక సినిమాల్లో నటించిన పునీత్.. అప్పు సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు.



కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.గతేడాది అక్టోబర్‌29న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే అతని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. కన్నడ  సూపర్ స్టార్ దివంగత రాజ్‌కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్. బాలనటుడి గా అనేక సినిమాల్లో నటించిన పునీత్.. అప్పు సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు. పునీత్ కు తెలుగునాట అశేష అభిమానగణం ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని తాయారు చేశారు. ఈ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

Published on: Nov 01, 2022 05:13 PM