
దళపతి విజయ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి విజయ్ కు ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. బహిరంగ సభలో పలువురు మరణించడం, చివరిగా చేసిన జననాయగన్ సినిమా విడుదలకు నోచుకోకపోవడం, సరిగా ఎలక్షన్స్ సమయానికి కట్టుకున్న భార్య విడాకులు కోరడంతో విజయ్ కుదెబ్బమీద దెబ్బ తగిలినట్టు అయ్యింది. హీరోయిన్ తో విజయ్ కు సంబంధం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేసింది విజయ్ భార్య. దాంతో విజయ్ కు పెద్ద షాక్ తగిలినట్టే అయిందే.. భార్య చేసిన ఆరోపణల పై విజయ్ ఇప్పటివరకూ ఎక్కడ స్పందించలేదు.
తాజాగా విజయ్ తన భార్య చేసిన ఆరోపణల పై పరోక్షంగా స్పందించారు. ప్రస్తుతం ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాడు విజయ్. తూతుకుడి, తిరునెల్ వెళ్లి ప్రాంతాలలో బహిరంగ సభల్లో తన సతీమణి సంగీత గురించి పరోక్షంగా చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. 30ఏళ్లుగా నావెంటే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచారు అని విజయ్ అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
విజయ్ ఈ సభలో విజయ్ మాట్లాడుతూ.. సుమారుగా 30 సంవత్సరాల నుంచి నా చుట్టూ ఉన్నవాళ్లు సరిగ్గా ఎన్నికల సమయంలోనే నాకు వెన్నుపోటు పొడవడానికి ముందుకు వచ్చారు. అలా ఎందుకు చేస్తున్నారో మీ అందరికీ కూడా బాగా తెలుసు. నా పైన ఎంతమంది కుట్రలు చేసిన వెనకడుగు వేయను.. నా అభిమానులు నాతో ఉన్నారు.. వాళ్ల నుంచి నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు అని విజయ్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ కామెట్స్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.