కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం అటు సినిమా పనుల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ బిజీబిజీగా ఉంటున్నాడుc. ఇదిలా ఉండగా విజయ్ దళపతి ప్రముఖ స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కోసం రెండు ఐపీఎల్ టిక్కెట్లు కొన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా వరలక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నేను చూసిన మొదటి రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల టిక్కెట్లు దళపతి విజయ్ కొన్నాడు. తొలి మ్యాచ్ చెన్నైలో జరిగింది. ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే జట్లు ఈ పోటీలో తలపడ్డాయి’ అని వరలక్ష్మి చెప్పుకొచ్చింది.
కాగా వరలక్ష్మి శరత్‌కుమార్ తమిళం తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇటీవలే పాన్ ఇండియా హిట్ మూవీ ‘హనుమాన్’ సినిమాలో హీరో తేజ సజ్జా సోదరిగా నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే, నికోలాయ్ సహదేవ్‌తో వరలక్ష్మి శరత్‌కుమార్ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే ఈ ప్రేమ పక్షులు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
Voted..have you..??
BE THE CHANGE..dont complain later..now is your chance..#Vote #LokSabhaElection2024 #airportdiaries @realradikaa @realsarathkumar pic.twitter.com/PpkrvkaQuH— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) April 19, 2024
ఇక దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా 80 రష్యాలోనే చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, మోహన్, జయరామ్ తదితరులు నటించారు. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విజయ్ ద్విపాత్రాభియనం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశముందని కోలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
Only he can break his own records!!! Cos @actorvijay na is #TheGreatestOfAllTime our first single #WhistlePodu crosses 25.5 MILLION realtime views in 24 hours!! @thisisysr @madhankarky @archanakalpathi @aishkalpathi @Jagadishbliss @Ags_production @TSeries #TheGOAT #aVPhero pic.twitter.com/V2kRQquoxC
— venkat prabhu (@vp_offl) April 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.