Puri Jagannadh: ముంబైలో కారులో వెళ్తూ.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన పూరి జగన్నాథ్.. పరిగెత్తుకుంటూ వచ్చిన కుర్రాడు..

|

Oct 25, 2021 | 8:34 PM

పూరి జగన్నాథ్.. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ప్రజంట్ జనరేషన్‌కి అర్థం అయ్యే విధంగా సినిమాల ద్వారా జీవిత సత్యాలు చెప్పడంలో...

Puri Jagannadh: ముంబైలో కారులో వెళ్తూ.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన పూరి జగన్నాథ్.. పరిగెత్తుకుంటూ వచ్చిన కుర్రాడు..
Puri Jagannadh
Follow us on

పూరి జగన్నాథ్.. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ప్రజంట్ జనరేషన్‌కి అర్థం అయ్యే విధంగా సినిమాల ద్వారా జీవిత సత్యాలు చెప్పడంలో, హిత బోధ చేయడంలో మాస్టర్. హీరోల బాడీ లాంగ్వేజ్ మార్చేసి.. మాస్ బొమ్మలు తీసే ఊరమాస్ డైరెక్టర్. హీరోల మాదిరి స్టార్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే పూరి మాత్రమే. పూరిని ఒక డైరెక్టర్ గానే కాదు హ్యూమన్ బీయింగ్‌గా కూడా లైక్ చేస్తారు ఆయన ఫ్యాన్స్. ఇతడి పని అయిపోందిరా అని అన్నప్పుడల్లా.. ఒక్కసారిగా ఎగసిపడటం పూరి స్టైల్. ఇక పూరి పాడ్‌కాస్ట్‌లకు ఉన్న ఫాలోవర్స్ లిస్ట్ అయితే చాంతాడంత ఉంటుంది. తన లాస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌తో ఊర మాస్ బ్లాక్ బాస్టర్ అందుకున్న పూరి.. ప్రజంట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పనుల కోసం పూరి అండ్ టీమ్ ఎక్కువగా ముంబైలో టైమ్ స్పెండ్ చేస్తోంది.

తాజాగా ముంబైలో కారులో వెళ్తూ.. ఓ ట్రాఫిక్ సిగ్నల్ ఆగిన పూరిని… ఓ తెలుగు కుర్రాడు గుర్తుపట్టాడు. కారు వెనుక టీఎస్ రిజిస్ట్రేషన్ ఉండటంతో.. తెలుగువాళ్లు ఉంటారని కారు లోపలికి చూశాడు. లోపల పూరి కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. కాసేపు ఆ కుర్రాడికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆపై తాను పూరికి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు. పూరి అతడితో కాసేపు ముచ్చటించి.. వివరాలు తెలుసుకున్నాడు. బాగా చదువుకోవాలని సూచించాడు.  ఆ కుర్రాడు కారులో ఉన్న చార్మీని కూడా పలకరించాడు. అయితే పూరీతో సెల్ఫీ తీసుకుందాం అతను కోరుకున్నప్పటికీ అతడు వద్ద ఫోన్ లేని కారణంగా వీలు పడలేదు. దీంతో అతడి కోసం వీడియో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చార్మీ. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: షమీకి వ్యతిరేకంగా జాత్యహంకార వ్యాఖ్యలు.. మండిపడ్డ సెహ్వాగ్

రిజ్వాన్​ మాములోడు కాదు.. పక్కా ప్లానింగ్‌తో వచ్చాడు.. షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన ఐసీసీ