AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎలా ఉండేదానివి ఎలా అయ్యావ్ అమ్మాయ్.. ఇంతకీ మీరు గుర్తుపట్టారా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అ ఆ చిత్రంలోని మంగమ్మ పాత్ర ద్వారా హరితేజ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు తిరుగులేదు అనుకున్నారు అందరూ. కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. అటు తిరిగి సీరియల్స్‌వైపు కూడా వెళ్లలేకపోయింది. పెళ్లి చేసుకుని.. పాపకు జన్మనిచ్చింది.

Tollywood: ఎలా ఉండేదానివి ఎలా అయ్యావ్ అమ్మాయ్.. ఇంతకీ మీరు గుర్తుపట్టారా..?
Hariteja
Ram Naramaneni
|

Updated on: Mar 27, 2023 | 9:04 PM

Share

ఈమె ఇంచుమించు మరో సూర్యకాంతంలా పేరు సంపాదిస్తుంది.. నటి హరితేజ గురించి ఈ మాట అన్నది ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. కానీ ఎందుకో తెలీదు కానీ ఆ తర్వాత అంతలా దూసుకెళ్లలేకపోయింది ఈ అమ్మడు. బిగ్ బాస్ సీజన్‌లో పార్టిసిపెంట్‌గా వెళ్లి మంచి పేరు సంపాదించింది. అప్పడు థర్డ్ ప్లేసులో నిలిచింది. ఒకప్పుడు బొద్దుగా, ముద్దుగా ఉండేది కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. డైట్ చేసి.. చేసి సన్నజాతి తీగలా అయ్యింది. అయినప్పటికీ అప్పటి లుక్కే బాగుందని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. తను మంచి కూచిపూడి డ్యాన్సర్ కూడా. తొలుత టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ, సీరియల్స్‌లో నటిస్తూ వచ్చింది. మనసు-మమత, ముత్యమంత పసుపు వంటి కొన్ని ప్రముఖ టీవీ సీరియల్స్‌లో నటించింది. దిక్కులు చూడకు రామయ్య , అందరి బంధువయ, దమ్ము, దువ్వాడ జగన్నాధం, అనగనగా ఓ ధీరుడు , విన్నర్ , అత్తారింటికి దారేది , ఉంగరాల రాంబాబు ,  రాజా ది గ్రేట్ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. హరి తేజ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో 24 ఫిబ్రవరి 1992న జన్మించింది. ఆమె తండ్రి మఠారీ కాగా, తల్లి కన్నడ రాష్ట్రానికి చెందినవారు. హరితేజ తండ్రి BSNLలో ఉద్యోగి.

దీపక్‌తో అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న హరితేజ.. 2021లో ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి అటు బుల్లితెరకు, వెండితెరకు దూరంగా ఉంది. త్వరలో మరోసారి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
గూగుల్ తల్లికే చుక్కలు చూపించిన నెటిజన్లు.. ఎక్కువగా అడిగిన..
గూగుల్ తల్లికే చుక్కలు చూపించిన నెటిజన్లు.. ఎక్కువగా అడిగిన..
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..