Telugu Actor Annapurna: కూతురు కీర్తిని జ్ఞాపకం చేసుకున్న అన్నపూర్ణ.. ఎందుకు అలా చేసిందో ఇప్పటికీ తెలియదంటూ కన్నీరు

Telugu Actor Annapurna:స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన హీరోయిన్ గా వెండి తెరపై అడుగు పెట్టారు అన్నపూర్ణ. కాలక్రమంలో కుంతీ పుత్రుడు..

Telugu Actor Annapurna: కూతురు కీర్తిని జ్ఞాపకం చేసుకున్న అన్నపూర్ణ.. ఎందుకు అలా చేసిందో ఇప్పటికీ తెలియదంటూ కన్నీరు
Annapurna

Edited By:

Updated on: Jul 16, 2021 | 6:32 PM

Telugu Actor Annapurna: స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన హీరోయిన్ గా వెండి తెరపై అడుగు పెట్టారు అన్నపూర్ణ. కాలక్రమంలో కుంతీ పుత్రుడు సినిమాలో మోహన్ బాబు తల్లిగా నటించారు. హీరోయిన్ గా సినీ పరిశ్రమలో అడుగు పెట్టినా కొద్దికాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్నపూర్ణ షిప్ట్ అయ్యారు. దాదాపు 700 వందలకు పైగా సినిమాల్లో నటించిన అన్నపూర్ణ తెలుగువారందరికీ సుపరిచిత నటి. అయితే అన్నపూర్ణ ఓ అమ్మాయిని దత్తత తీసుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. అనంతరం ఆ అమ్మాయి కీర్తికి కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి కూడా చేశారు. అయితే ఓ పాపకు జన్మనిచ్చిన తరువాత కీర్తి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో ఈ కేసు సంచలనంగా కూడా మారింది.

ఇటీవల ఓ సందర్భంలో అన్నపూర్ణ తన కూతురు కీర్తిని గుర్తు చేసుకున్నారు. కీర్తి ఆత్మహత్య ఆమె అత్తారిల్లు గురించి స్పందించారు. తన కూతురు మరణం తనకు తీరని దుఃఖం కలిగించిందని అన్నారు. అయితే తన కూతురు ఎప్పుడూ అత్తవారింట్లో తనను కష్టపెడుతున్నారని చెప్పలేదు.. అసలు కీర్తి ఇంట్లో ఏమి జరిగిందో నాకు తెలియదు అన్నారు. కీర్తి అత్తవారు చాలా మంచి వాళ్ళు.. అయితే కీర్తి ఎందుకు ఆత్మ హత్య చేసుకుందో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదని అన్నారు. అయితే తన కూతరుకి కాస్త కోపం ఎక్కువ అని .. సమస్య ఏమిటో చెప్పకుండా దూరతీరాలకు వెళ్లిపోయిందని ఏదైనా చిన్న మాటకు హార్ట్ అయి.. క్షణికావేశంలో కీర్తి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అన్నపూర్ణ చెప్పారు. తన మనవరాలిని కొన్ని నెలలు పెంచాను. తర్వాత వాళ్ళ నాన్నదగ్గరకు వెళ్ళిపోయింది. చాలా సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం ఐదేళ్లు నా మనవరాలికి అంటూ అన్నపూర్ణమ్మ గతాన్ని .. కూతురు క్షణికావేశంలో చేసిన గాయం తాలూకూ బాధను పంచుకున్నారు.

Also Read: పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపూల మహాయాగం ప్రారంభం.. ఆనలైన్‌లో టికెట్లు లభ్యం