మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత నటిస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. యూట్యూబ్ లో సాంగ్స్ దూసుకుపోతున్నాయి. ఇందులో చరణ్ సరసన మరోసారి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్ జే సూర్య, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాకు బెనిఫిట్ షోస్, టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది. గేమ్ ఛేంజర్ చిత్ర నిర్మాతల విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు అంటే శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. ఇక విడుదల రోజు సింగిల్ స్క్రీన్స్ లో అదనంగా రూ.100, మల్టీప్లెక్సులలో రూ.150 పెంచుకోవడానికి.. జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్ లో రూ.50, మల్టీప్లెక్సులలో రూ.100 పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు జీఎస్టీతో కలిపి ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వ్యూలలో స్పష్టం చేసింది. ఈ మేకరు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్స్, పోలీస్ కమిషనర్లు, లైసెన్స్ జారీ చేసే అధికారులను ఆదేశించింది.
మరోవైపు అర్ధరాత్రి ఒంటిగంటకు పెంచిన ధరతో బెనిఫిట్ షోకు అనుమతించాలన్న విజ్ఞప్తిని మాత్రం తిరస్కరించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో అర్దరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.600 నిర్ణయించారు.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.