తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాజకీయ, సినీ , క్రీడా ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఫలాలు అందాలని ఆకాంక్షించారు. సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ స్వప్నం నిజమై నేటికి పది సంవత్సరాలు. అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అంటూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విషెస్ చెప్పారు చిరంజీవి. ఇక చిరంజీవి తమ్ముడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘పోరాటాలకు పురిటి గడ్డయిన తెలంగాణే తనలో పోరాట స్ఫూర్తిని నింపింది’ అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్. ‘భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది. 1947లో తెలంగాణ మినహా దేశమంతటికీ స్వాతంత్ర్య సిద్ధించింది. కానీ తెలంగాణ మరో రెండు సంవత్సరాల పాటు స్వాతంత్రం కోసం వేచిచూడవలసి వచ్చింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం సుమారు 60 సంవత్సరాల పాటు ఎదురుచూడవలసి వచ్చింది. సకల జనుల కల సాకారమై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’
‘పోరాటాలకు పురిటి గడ్డయిన తెలంగాణ నాలో పోరాట స్ఫూర్తిని నింపింది. ఇక్కడ గాలి.. నేల.. నీటి.. మాటలో… చివరకు పాటలో సైతం పోరాట పటిమ తొణికిసలాడుతోంది. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో సకల జనులు సాగించిన ఉద్యమాన్ని పాలకులు సదా గుర్తు పెట్టుకోవాలి. ప్రజలందరికీ తెలంగాణ పలాలు సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా సమానంఆ అందాలి. అభివృద్ధిలో తెలంగాణా రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలపాల్సిన బాధ్యత పాలకుపై ఉంది. ప్రజా తెలంగాణను సంపూర్ణంగా ఆవిష్కరింపచేయాలి. అప్పుడే ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరులకు నిజమైన నివాళి. ఈ దశాబ్ద వేడుకల సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై తెలంగాణ జై భారత్’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
చిరంజీవి ట్వీట్..
తెలంగాణ స్వప్నం నిజమై నేటికి పది సంవత్సరాలు. అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.💐💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 2, 2024
పవన్ కల్యాణ్ ట్వీట్..
సకల జనుల విజయం… తెలంగాణ ఆవిర్భావం – JanaSena Chief Shri @PawanKalyan #TelanganaFormationDay pic.twitter.com/m187Brt5lD
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి