తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై మొదలైన కేసీఆర్ రైతు ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్లింది. రాష్ట్రంలో యాసంగిలో ధాన్యం కొంటరా? లేదా? అన్నది కేసీఆర్ సర్కారు స్ట్రట్ క్వశ్చన్. రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతించిన సీఎం కేసీఆర్.. అమరులైన రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చనిపోయిన ప్రతీ రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం.. 750 మంది రైతు కుటుంబాలకు కేంద్రం 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు జల్లు కురుస్తోంది. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ ప్రముఖుల వరకు సీఎం ఉదారతను అభినందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసీఆర్ సాయం ప్రకటనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించడం గర్వంగా ఉందన్నారు.
Proud of Hon’ble @TelanganaCMO #KCR Garu for announcing ₹3 lakh ex gratia to all the 750 plus farmers who lost lives fighting the #FarmLaws in NCR ?
He also demanded Govt of India to announce ₹25 lakh ex gratia to each farmer family & also withdraw all cases unconditionally
— KTR (@KTRTRS) November 20, 2021
కేటీఆర్ ట్వీట్‌కు రీట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్ కేసీఆర్ ప్రకటనను అభినందించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ మోదీ సారీ చెప్తే సరిపోదు. చనిపోయిన కుటుంబాల బాధ్యత తీసుకోవాలంటూ ప్రకాశ్ రాజ్ గుర్తు చేశారు.
Dear Prime Minister , SORRY is not enough .. Will you own up the responsibility.. and reach out #justasking https://t.co/BtgC1gZ89x
— Prakash Raj (@prakashraaj) November 21, 2021
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన నటి సమంత.. ధన్యవాదాలు తెలిపారు.
— Samantha (@Samanthaprabhu2) November 21, 2021
అటు హీరోలు నాని, రామ్‌లు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని అభినందించారు. రైతుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు.
??
Thank you @TelanganaCMO https://t.co/jPt4UtMtjY
— Nani (@NameisNani) November 20, 2021
Keeping the complications behind the #Farmlaws aside..I’m extremely glad to see our @TelanganaCMO #KCR Garu support the farmers beyond our state..his love for farmers has crossed boundaries and so has my respect for him.? https://t.co/5um4u4PMRI
— RAm POthineni (@ramsayz) November 21, 2021
Also Read: Kaikala Satyanarayana: కైకాల ఆరోగ్య పరిస్థితిపై గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి