AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ చంద‌మామే కావాలంటోన్న ద‌ర్శ‌కుడు తేజ‌..!

ద‌ర్శ‌కుడు తేజ ఇండ‌స్ట్రీకి బోలెడు మంది న‌టీన‌టుల‌ను ప‌రిచ‌యం చేశారు. గ‌తంలో ఆయ‌న ఓన్లీ కొత్త ఆర్టిస్టుల‌తోనే సినిమాలు తీసేవారు. ఈ క్ర‌మంలోనే తేజ తీసిన‌ `లక్ష్మీ కల్యాణం` మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది చంద‌మామ‌ హీరోయిన్.

మళ్లీ చంద‌మామే కావాలంటోన్న ద‌ర్శ‌కుడు తేజ‌..!
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2020 | 3:45 PM

Share

ద‌ర్శ‌కుడు తేజ ఇండ‌స్ట్రీకి బోలెడు మంది న‌టీన‌టుల‌ను ప‌రిచ‌యం చేశారు. గ‌తంలో ఆయ‌న ఓన్లీ కొత్త ఆర్టిస్టుల‌తోనే సినిమాలు తీసేవారు. ఈ క్ర‌మంలోనే తేజ తీసిన‌ `లక్ష్మీ కల్యాణం` మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది చంద‌మామ కాజ‌ల్. ఆ తర్వాత టాలీవుడ్ లో బ‌డా హీరోలు ప‌క్క‌న ఆడిపాడి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పడు కూడా వరుస సినిమాల‌తో బిజీగానే ఉంది. ఇక తేజ ద‌ర్శ‌క‌త్వంలో `లక్ష్మీ కల్యాణం`తో పాటు ఇటీవ‌ల తెర‌కెక్కించిన‌ `నేనే రాజు నేనే మంత్రి`, `సీత` చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటించింది కాజ‌ల్. తాజా సమాచారం ప్రకారం మరోసారి వీరిద్దరూ కలిసి వ‌ర్క్ చేయ‌బోతున్నార‌ట‌. గోపీచంద్ హీరోగా డైరెక్టర్ తేజ `అలిమేలు మంగ వెంకటరమణ` అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవి , కీర్తి సురేష్ పేర్లు ప‌రిశీలించారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలతో డేట్స్ ఇవ్వ‌లేనంత బిజీగా ఉన్నారు. దాంతో దర్శకుడు తేజ మళ్లీ కాజల్‌ వైపే మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది. గోపీచంద్, కాజల్ ఇప్పటివరకు కలిసి నటించక‌పోవ‌డంతో..తెర‌పై కూడా వీరి జంట కొత్తగా ఉటుందని భావిస్తున్నారట.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?