తేజూ మూవీ స్క్రిప్ట్‌లో మార్పులు చెప్పిన మెగాస్టార్..!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌పై చిరంజీవికి ముందు నుంచి ప్రత్యేక అభిమానం ఉంది. ఇండస్ట్రీ ఎంట్రీ దగ్గర్నుంచి ఆయన తేజూకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సాయి తేజ్ ప్రతి సినిమా విషయంలో చిరంజీవి పలు సలహాలు ఇవ్వడంతో పాటు సూచనలు చేస్తుంటారు.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌పై చిరంజీవికి ముందు నుంచి ప్రత్యేక అభిమానం ఉంది. ఇండస్ట్రీ ఎంట్రీ దగ్గర్నుంచి ఆయన తేజూకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సాయి తేజ్ ప్రతి సినిమా విషయంలో చిరంజీవి పలు సలహాలు ఇవ్వడంతో పాటు సూచనలు చేస్తుంటారు. తాజాగా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమాకి క్లైమాక్స్ కి సంబంధించి పలు మార్పులు చేయమని మెగాస్టార్ సూచించారట. ఆ మార్పుల తర్వాత స్క్రిప్ట్ చిరుని ఇంప్రెస్ చేస్తే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చిత్రం..ప్రస్తుత పరిస్థితులు కుదుటపడ్డ తర్వాత విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ మూవీ విడుదల అనంతరం తర్వాతి ప్రాజెక్ట్‌పై కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటూ కథలు వింటోన్న తేజూకి ‘భగవద్గీత సాక్షిగా’ అనే లైన్ బాగా నచ్చిందట. ఆ స్క్రిప్ట్ నే మెగాస్టార్ కి వినిపించగా కొన్ని మార్పులు సూచించారట.




