HanuMan Trailer: హను-మాన్ ట్రైలర్ వచ్చేసింది .. ఆకట్టుకుంటున్న విజువల్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో తేజ హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది'. హీరోగా తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకొని దర్శకులను ఆకర్షించాడు తేజ. ఈ యంగ్ హీరో ఆతర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

HanuMan Trailer: హను-మాన్ ట్రైలర్ వచ్చేసింది  .. ఆకట్టుకుంటున్న విజువల్స్
Hanuman
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 19, 2023 | 3:50 PM

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాలు చేసి ఆతర్వాత హీరోగా మారాడు తేజ సర్జ. సమంత నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు తేజ.. ఆ తర్వాత మెయిన్ హీరోగా మారిపోయాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో తేజ హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది’. హీరోగా తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకొని దర్శకులను ఆకర్షించాడు తేజ. ఈ యంగ్ హీరో ఆతర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు తేజ.

ప్రశాంత్ వర్మ మొదటి నుంచి ప్రయోగాత్మక సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. గతంలో వచ్చిన జాంబీ రెడ్డి, అ, కల్కీ లాంటి సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తేజ తో కలిసి హను-మాన్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మొదటి నుంచి ఈ సినిమా పై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా చేస్తూ వచ్చారు టీమ్.

ఇక ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ సినిమా అంచనాలనుయ్ పెంచేసింది . యతో ధర్మ స్తతో హనుమ..యతో హనుమ..స్తతో జయ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పల్లెటూరిలో ఉండే ఓ కుర్రాడికి నీటి అడుగున స్పెషల్ పవర్ దొరకడం దాంతో అతనికి పవర్స్ రావడం ఈ ట్రైలర్ లో చూపించారు. అలాగే విలన్ ఆ పవర్ కోసం ఆ పల్లటూరి పై దాడి చేయడం చూపించారు. చివరిలో హనుమంతుడు రావడం కూడా చూపించారు. హాలీవుడ్ లో మనం చూసిన మార్వెల్స్ సిరీస్ లానే హను-మాన్‌ సినిమాను  తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ తేజ అక్క పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..