Hanu Man Movie: హనుమాన్ మూవీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..

|

Jan 12, 2024 | 12:03 PM

సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమాను థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. గతంలో తేజసజ్జతో కలిసి జాంబీరెడ్డి అనే సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Hanu Man Movie: హనుమాన్ మూవీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..
Hanuman
Follow us on

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్. నేడు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి హనుమాన్ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమాను థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. గతంలో తేజసజ్జతో కలిసి జాంబీరెడ్డి అనే సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సంక్రాంతికి భారీ పోటీ ఉన్నాకూడా కంటెంట్ మీదున్న నమ్మకంతో హనుమాన్ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. అనుకున్నట్టుగానే హనుమాన్ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాలో తేజ సజ్జకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వినయ్ రాయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ , సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. హనుమాన్ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ ఆనందంలో తేలిపోతున్నారు. ఇక ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ హైలైట్ అనే చెప్పాలి. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన కూడా సినిమాను రిచ్ గా తెరకెక్కించారు. విజువల్ వండర్ గా హనుమాన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా ఓటీటీ రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. హనుమాన్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 దక్కించుకుందని తెలుస్తోంది. ఫ్యాన్సీ రేటుకు హనుమాన్ మూవీని దక్కించుకుందట జీ5. ఇక 2025లో జై హనుమాన్‌ పేరుతో పార్ట్‌-2 వస్తుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఇక హనుమాన్ సినిమా కు హిట్ టాక్ రావడంతో ఓటీటీలోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఎంతవరకు కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.