Taraka Ratna: తారకరత్నమరణాన్ని జీర్ణించుకోలేకపోతోన్న భార్య అలేఖ్య.. ‘ఈ జీవితానికి నువ్వూ నేను మాత్రమే’ అంటూ..

జీవితాంతం కష్ట సుఖాలు పంచుకోవాలనుకుని ప్రేమ పెళ్లి చేసుకున్న తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి భర్త జ్ఞాపకాల్లోంచి ఇంకా బయటకు రావడం లేదు. ఆమెతో పాటు కూతురు నిష్క నిత్యం తారకరత్నను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ పోస్టులు షేర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Taraka Ratna: తారకరత్నమరణాన్ని జీర్ణించుకోలేకపోతోన్న భార్య అలేఖ్య.. ఈ జీవితానికి నువ్వూ నేను మాత్రమే అంటూ..
Taraka Ratna's Wife Alekhya

Updated on: May 05, 2023 | 5:18 PM

నందమూరి తారకరత్న అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. నారా లోకేశ్‌ పాదయాత్రలో గుండెపోటుకు గురైన ఆయన సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలనుకున్న తారకరత్న చిన్న వయసులోనే కన్నుమూయడంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా జీవితాంతం కష్ట సుఖాలు పంచుకోవాలనుకుని ప్రేమ పెళ్లి చేసుకున్న తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి భర్త జ్ఞాపకాల్లోంచి ఇంకా బయటకు రావడం లేదు. ఆమెతో పాటు కూతురు నిష్క నిత్యం తారకరత్నను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ పోస్టులు షేర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మరో పోస్టును షేర్‌ చేసింది అలేఖ్య. తన భర్తతో కలిసున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఈ జీవితానికి నువ్వూ నేను మాత్రమే!.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇచ్చి వెళ్లావు. వాటితో నేను ముందుకు వెళతాను. నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను’ అని ఎమోషనలైంది అలేఖ్యా రెడ్డి.

ఇక మరొక పోస్టులో తారకరత్న చిన్ననాటి ఫోటోను, తన కుమారుడి ఫోటోను షేర్‌ చేస్తూ.. వీళ్లే తన స్టార్స్‌ అంటూ పేర్కొంది. అంతకుముందు పిల్లలతో కలిసి తారకరత్న గడిపిన మధురుమైన క్షణాలను ఓ వీడియో రూపంలో షేర్ చేసింది. దీనికి ‘నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేకపోతున్నాను’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. మొత్తానికి తారకరత్న మరణాన్ని అలేఖ్య ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. కాగా నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..