తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ చిత్రం జైభీమ్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలించింది. ఇందులో సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వడమే కాకుండా.. సినీ విశ్లేకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. భారతదేశంలోని సామాజిక అసమానతలు.. కుల వివక్ష వంటి అంశాలను ప్రస్తావిస్తూ గిరిజనులు.. ఆదివాసీ తెగలకు చెందిన అమాయకపు ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. జస్టిస్ కె చంద్రు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరక్కించారు.
మణికందన్, లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య – జ్యోతిక నిర్మించారు. అంతేకాకుండా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రజిషా విజయన్ ఇతర పాత్రలలో నటించి మెప్పించారు. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే ఇటీవలే ఈ సినిమాను ఆస్కార్ యూట్యూబ్ ఛానల్లో ప్రశంసించారు. సినిమా రేటింగ్ సంస్థ IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా జైభీమ్ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నెషనల్ ఫిలిం ఫెస్టివల్ 2022కు సూర్య సినిమా ఎంపికయ్యింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ట్వీట్..
Another feather in the cap✨#JaiBhim has been officially selected into the @noidafilmfest @Suriya_offl #Jyotika @tjgnan @rajsekarpandian @PrimeVideoIN pic.twitter.com/o6BrQGp1zA
— 2D Entertainment (@2D_ENTPVTLTD) January 19, 2022
Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..