
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రోజులు గడుస్తున్నా ఆ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక మన మధ్య లేరు అన్న చేదు వార్తను నమ్మలేక పోతున్నారు. తన ఇంట్లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే బెంగళూరు లోని ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. చికిత్స పొందుతూ పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణం తో కన్నడ చిత్రసీమ శోకసంద్రలో మునిగిపోయింది. పునీత్ అంతిమ యాత్రకు లక్షలాదిగా అభిమానులు తరలివచ్చారు. పునీత్ మరణం తర్వాత ఆయన కుటుంబసభ్యులను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. పునీత్ అన్న శివరాజ్ కుమార్ ను ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రానా, వెంకటేష్, శ్రీకాంత్, అలీ, రామ్ చరణ్, సూర్య, జయప్రద ఇలా పలువురు పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు.
తాజాగా ప్రముఖ నటుడు శరత్ కుమార్ పునీత్‌ను తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు. పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పునీత్ చనిపోయాడంటే కలలా ఉందిఅని కన్నీరు పెట్టుకున్నారు. నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడనుకున్నా.. కానీ నేను పునీత్ మరణ వార్త వినాల్సి వచ్చింది అని కన్నీరు మున్నీరు అయ్యారు శరత్ కుమార్. ఆ దేవుడు పునీత్ కు బదులు నన్ను తీసుకెళ్లిన బాగుండు అంటూ ఎమోషనల్ అయ్యారు పునీత్ రాజ్ కుమార్. పునీత్ కు భారత రత్న ఇవ్వాలని ఆయన కోరారు.
మరిన్ని ఇక్కడ చదవండి :