సినీ,క్రీడా సెలబ్రెటీలకే కాదు పొలిటికల్ లీడర్స్‌కు పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. జనాదరణలో స్టాలిన్ అగ్రస్థానం

సినీ,క్రీడా సెలబ్రెటీలకే కాదు పొలిటికల్ లీడర్స్‌కు పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. జనాదరణలో స్టాలిన్ అగ్రస్థానం
Cm Stalin

ఏపీ సీఎం జగన్, తమిళ నాడు సీఎం స్టాలిన్..! ఇద్దరికీ మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ... సూపర్‌ క్రేజ్‌ ఉంది.. ప్రత్యర్థులను మట్టికరిపించి.. సీఎం పీఠం పై కూర్చున్నారనే పేరుంది.

Rajeev Rayala

|

Jul 03, 2021 | 3:48 PM

ఏపీ సీఎం జగన్, తమిళ నాడు సీఎం స్టాలిన్..! ఇద్దరికీ మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ … సూపర్‌ క్రేజ్‌ ఉంది.. ప్రత్యర్థులను మట్టికరిపించి.. సీఎం పీఠం పై కూర్చున్నారనే పేరుంది. ఒంటి చేత్తో పార్టీని నడిపించే తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. కాని ఈ నేతలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పోటీ పడుతున్నారు. నవ్వా నేనా అంటూ.. ఫ్యూస్ కౌంట్ను సాగిస్తున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ పోటీలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఎవరికీ అందనంత రేంజ్ లో ఫస్ట్ ప్లేస్ లో వున్నారు. ‘స్టాలిన్ దా వరారు.. విడియల్ తరారు’ అనే లీడ్ తో సాగే ఎలక్షన్ కాన్వాసింగ్ సాంగ్… తమిళ్ సోషల్ మీడియా సర్కిల్స్ లో రికార్డుల మోత మోగించింది. కేవలం నాలుగు నెలల్లో 58 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది ఈ పాట. నేను రెడీ మీరు రెడీయా అంటూ స్టాలిన్ వాయిస్ తో మొదలయ్యే ఈ సాంగ్.. ఎలక్షన్ కంప్లీట్ అయినప్పటికీ అందర్నీ ఆకట్టుకుంటూ క్రేజీగా దూసుకుపోతోంది.

ఎన్నికల పాట విషయంలో స్టాలిన్ తో పోలిస్తే ఏపీ సీఎం జగన్ చాలా వెనుకబడి వున్నారు. రావాలి జగన్-కావాలి జగన్ అనే లిరిక్స్ తో మొదలయ్యే కాన్వాసింగ్ సాంగ్.. ఎన్నికల సమయంలో ఏపీ మొత్తం రీసౌండ్ ఇచ్చింది. జగన్ గెలుపునకు దారి పరిచింది ఇదేనని కూడా చెబుతారు. ప్రశాంత్ కిషోర్ లీడర్ షిప్ లో IPAC టీమ్ రూపొందించిన ఈ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. సుద్దాల అశోక్ తేజ రాసిన లిరిక్స్ ని ఎంతో ఎమోషనల్ అప్పీల్ తో పాడారు సింగర్ మనో. కానీ.. యూట్యూబ్ లో మాత్రం ఆ పాట సత్తా చాటలేకపోయింది. రెండేళ్లు దాటినా ఇంకా జస్ట్ 300 మిలియన్ల దగ్గరే నిలబడిపోయింది. స్టాలిన్ పాట చేసిన స్కోర్లో సగం కూడా చేయలేకపోయింది. ఏదేమైనా జగన్ పాపులారిటీని కూడా క్వశ్చన్ చేస్తూ దూసుకుపోతున్న స్టాలిన్.. యూట్యూబ్ లో సిసలైన విజేతగా నిలిచారు.

రాజ శ్రీహరి, TV9 Telugu, ET Desk

మరిన్ని ఇక్కడ చదవండి :

Pragya Jaiswal: పోకిరి సినిమా సీన్ రిపీట్ అయిందిగా.. హీరోయిన్ ను చుట్టుముట్టిన యాచకులు..

Cinematograph Act: సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై రగడ.. అసలు యాక్ట్‌లో ఏముంది.. కేంద్రం ఏం తెస్తోంది. .?

NTR 30: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్… టైటిల్ ఫిక్స్ చేసే పనిలో కొరటాల.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu