AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay -Beast: విజయ్ అభిమానులకు గుడ్‏న్యూస్.. బీస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ నటించిన సినిమాలన్ని

Vijay -Beast: విజయ్ అభిమానులకు గుడ్‏న్యూస్.. బీస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..
Beast
Rajitha Chanti
|

Updated on: Jan 01, 2022 | 12:09 PM

Share

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ నటించిన సినిమాలన్ని తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవలే మాస్టర్ గా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బీస్ట్. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రానికి దీలిప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తిని క్రియేట్ చేసింది. చాలా రోజుల తర్వాత బీస్ట్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. న్యూఇయర్ కానుకగా బీస్ట్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్.

బీస్ట్ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ విజయ్‏కు సంబంధించిన సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే జార్జియా, చెన్నై సహా పలు ప్రాంతాల్లో 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఇది పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్.. రాజకీయ నేపథ్యం హైలైట్ గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. షైన్ టామ్ చాక్, సెల్వరాఘవన్, యోగిబాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..

Follow Us
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..