తెలుగు రాష్ట్రాల్లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ అదరగొడుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తొలిసారిగా తెలుగులో నటించిన సార్ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో ధనుష్ సరసన మలయాళీ కుట్టి సంయుక్త కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ స్టార్ హీరోకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అయన నటించిన రాఘువరణ్ బీటెక్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు నేరుగా తెలుగులో మూవీ చేయడంతో అభిమానులు అదిరిపోయే వెల్కమ్ అందించారు. ధనుష్ కెరీర్ లోనే బెస్ట్ వసూళ్లు ఈ సినిమాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దక్షిణాదిలో ఈ చిత్రానికి మంచి టాక్ వస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సార్ చిత్రం అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతుంది.
మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాకు దాదాపు 2.65 కోట్లు షేర్ రాబట్టింది. అలాగే రెండో రోజు 3.15 కోట్ల షేర్ రాబట్టింది. అలా రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 5.80 కోట్ల షేర్స్ రాబట్టినట్లుగా టాక్. మొత్తంగా ధనుష్ నటించిన ఈ సార్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.54 కోట్ల గ్రాస్ తో దుమ్ములేపేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇక తమిళంలోనూ ఈ చిత్రం సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతుందని టాక్. భారీ ఓపెనింగ్స్.. మౌత్ టాక్ తో అదరగొట్టేస్తుందని తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు ముప్పై ఐదు కోట్ల షేర్ రాబట్టినట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్, శికర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.