Tamannaah: తమన్నాకు షాక్ ఇచ్చిన ‘జైలర్’ మూవీ టీమ్.. డీలాపడిన ఫ్యాన్స్

|

Aug 27, 2022 | 9:37 PM

రజనీ కాంత్(Rajinikanth)హీరోగా నెల్సన్ దిలీప్‌ ఓ సినిమా చేస్తున్నారన్న ఎనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచే ఈ సినిమాలో తమన్నా(Tamannaah)హీరోయిన్‌ అన్న ప్రచారం మొదలైంది.

Tamannaah: తమన్నాకు షాక్ ఇచ్చిన జైలర్ మూవీ టీమ్.. డీలాపడిన ఫ్యాన్స్
Tamanna
Follow us on

రజనీ కాంత్(Rajinikanth)హీరోగా నెల్సన్ దిలీప్‌ ఓ సినిమా చేస్తున్నారన్న ఎనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచే ఈ సినిమాలో తమన్నా(Tamannaah)హీరోయిన్‌ అన్న ప్రచారం మొదలైంది. చిత్రయూనిట్ కూడా ఈ న్యూస్‌ను ఖండించకపోవటంతో రజనీతో తమ్ము జోడి కట్టడం పక్కా అని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. కానీ లేటెస్ట్ ఎనౌన్స్‌మెంట్స్‌తో ఈ రూమర్స్‌కు చెక్‌ పడింది. తాజాగా షూటింగ్ స్టార్ట్ చేసిన జైలర్ టీమ్‌ రజనీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రివీల్ చేసింది. ఈ లుక్‌తో పాటు కాస్ట్‌ డీటైల్స్‌ను కూడా షేర్ చేసింది. రమ్యకృష్ణ, యోగి బాబు, వసంత్‌ రవి, వినాయకన్ కీ రోల్స్‌ ప్లే చేస్తున్నారని క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరన్న విషయాన్ని మాత్రం కన్ఫార్మ్ చేయలేదు.

లేటెస్ట్ ఎనౌన్స్‌మెంట్‌తో జైలర్‌లో తమ్మన్నా హీరోయిన్‌ అన్న న్యూస్‌కు ఫుల్‌స్టాప్‌ పడినట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. హీరోయిన్ ఫిక్స్ అయ్యింటే ఈ పాటికే ఎనౌన్స్‌ చేసేవారని.. తమన్నా హీరోయిన్‌ అన్న న్యూస్‌ జస్ట్ రూమర్ అంటూ కొట్టి పారేస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో తమన్నా ఫ్యాన్స్‌ కూడా తీవ్రంగానే హర్ట్ అయ్యారు. ఇక తమన్నా తెలుగులో సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో కూడా నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి