మా రిలేషన్‌లో ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీ లేవు.. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తాం అంతే.. ఓపెన్‌గా చెప్పేసిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

స్టార్ హీరోయిన్ తమన్నా సినిమాల కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించిన తమన్నా ఇప్పుడు సినిమాలు తగ్గించింది. అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి అభిమానులను సొంతం చేసుకుంది. ఇక బహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది తమన్నా. అయితే బాహుబలి సినిమా తర్వాత తమన్నా స్పీడ్ తగ్గించింది. అంతే కాకుండా ఆమె చేసిన సినిమాలు కొన్ని డిజాస్టర్స్ కూడా అయ్యాయి. దాంతో స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులేసింది.
తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీ సినిమాలోనూ స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా హిందీ సినిమాల పైనే పెడుతుంది. అంతే కాదు తమన్నా పర్సనల్ లైఫ్ గురించి కూడా వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమన్నా విజయ్ వర్మను పెళ్లాడుతుందని అంతా అనుకుంటుండగా ఇద్దరూ విడిపోయారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. మొన్నటి వరకు కలిసి తిరిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు విడిగా ఉంటున్నారని బాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు విషయం ఏంటంటే..
నటి రవీనా టాండన్ కూతురు రషా తడానీతో సన్నిహితంగా ఉంటోంది తమన్నా. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు. రషా తడానీ, తమన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అని బీ టౌన్ లో టాక్. దాంతో అంత చిన్న పిల్లతో మీకు స్నేహం ఏంటి.? ఆమెకు మీకు దాదాపు 15 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది అంటూ కొన్ని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనికి తమన్నా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. తమన్నా మాట్లాడుతూ.. రషా తడానీ నేను కలిసి ఓ పార్టీకి వెళ్ళాం.. అక్కడ ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. మేమిద్దరం చాలా సన్నిహితంగా మెలిగాం.. వయసుతో మాకు ఎలాంటి ఇబ్బందిలేదని వెల్లడించింది. ఎందుకంటే మా రిలేషన్‌లో ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీ లేవు. ఇద్దరం కలిసి కొంత సమయం ఎంజాయ్ చేస్తాం అంతే.. అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.