Tamannaah: సోషల్ మీడియాలో ఆగని రూమర్స్.. మరోసారి నెట్టింట తమన్నా పెళ్లి టాపిక్..

చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. ఇప్పుడు వరుసగా ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా తమన్నా వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.

Tamannaah: సోషల్ మీడియాలో ఆగని రూమర్స్.. మరోసారి నెట్టింట తమన్నా పెళ్లి టాపిక్..
Tamannaah Bhatia

Updated on: Dec 20, 2023 | 2:13 PM

తెలుగు సినీ పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలతో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది తమన్నా. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులను అలరించింది. చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. ఇప్పుడు వరుసగా ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా తమన్నా వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా మరోసారి మిల్కీ బ్యూటీ వివాహం గురించి ఆసక్తికర విషయం వైరలవుతుందమి.

తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తమన్నా, విజయ్ వర్మ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియరాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోన్న రూమర్స్ పై తమన్నా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తమన్నా స్పెషల్ సాంగ్ చేయనుందని తెలిస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ.. డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మిల్కీబ్యూటీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

తమన్నా చేయబోయే స్పెషల్ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ కానుందని టాక్. ఒకవేళ అదే నిజమైతే బాలయ్యతో తమన్నా చేస్తోన్న తొలి సినిమా ఇదే అవుతుంది. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో మెరిసింది తమన్నా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.