మిల్కీబ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. అటు చిత్రాలు, ఇటు వెబ్ సిరీస్ అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఈ క్రమంలో గతంలో తమన్నా వేసిన ఓ కేసును మద్రాసు హైకోర్ట్ వాయిదా వేసింది. కెరీర్ ప్రారంభం నుంచి ఇటు సినిమాలతోపాటు పలు వాణిజ్య ప్రకటనలలోనూ నటిస్తుంది తమన్నా. అయితే ఆమె నటించిన వాణిజ్య ప్రకటన ప్రసారం గడువు పూర్తైన సదరు సంస్థ ఆ ప్రకటనను ఉపయోగించడంతో తమన్నా దానిని వ్యతిరేకిస్తూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో తాను వాణిజ్య సంస్థకు సంబంధించిన ప్రకటనలో నటించానని.. అయితే ఒప్పందం గడువు పూర్తైన ప్రకటనను ఇంకా ఉపయోగిస్తున్నారని.. అందుకే తాను కోర్టును ఆశ్రయించానని తెలిపింది. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి సెంథిల్‌కుమార్ రామ్‌మూర్తి తమన్నా ప్రకటనలను ఆభరణాల కంపెనీ వాడకుండా మధ్యంతర నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయినప్పటికీ కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సదరు సంస్థ తన ప్రకటనను ఉపయోగిస్తున్నారంటూ మరోసారి తమన్నా మద్రాసు హైకోర్టులో కోర్టు ధిక్కార కేసును దాఖలు చేసింది. అయితే ఈ కేసు న్యాయముర్తులు సెంథిల్ కుమార్, రామమూర్తిల డివిజన్ బెంచ్ లో విచారణకు వచ్చింది. దీంతో ఆ వాణిజ్య సంస్థ తరపు న్యాయవాది ఆర్.కృష్ణ వాదిస్తూ తమన్నా నటించిన ప్రకటన ప్రసారాన్ని తమ సంస్థ నిలిపివేశామని.. కానీ ప్రైవేట్ వ్యక్తి వాట్సప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉపయోగిస్తుంటే తాము ఎలా బాధ్యులమవుతామని అన్నారు.
దీంతో ఈ కేసులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు న్యాయముర్తులు. అలాగే తదుపరి విచారణను సెప్టెంబర్ 12కి వాయిదా వేశారు. అదేవిధంగా ఓ సబ్బు ప్రకటన పై కూడా తమన్నా కేసు వేయగా.. సదరు సంస్థ తరపు న్యాయవాదులు ఎవరూ హాజరుకాలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.