Tamannaah Bhatia: మరోసారి బాయ్ ఫ్రెండ్‌తో దొరికిన తమన్నా.. ఈ సారి ఇలా

ఒకటి చెబుతూ.. ఇంకోటి చేస్తూ... సోషల్ మీడియాలో పుట్టించేశారు మూమెంట్. ఇక వీరి ఫ్యాన్స్ ఏమో.. వీరి రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ కోసం సెర్చ్‌ చేస్తూనే కూర్చున్నారు పాపం! కాని తాజాగా ఇదే ఫ్యాన్స్‌కు మరో వీడియో నెట్టింట తారసపడడంతో మళ్లీ అయిపోతున్నారు వైరల్.   బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయిన తమన్నా..

Tamannaah Bhatia: మరోసారి బాయ్ ఫ్రెండ్‌తో దొరికిన తమన్నా.. ఈ సారి ఇలా
Tamanna Bhatia

Updated on: Apr 25, 2023 | 2:11 PM

తమన్నా..విజయ్‌ వర్మ! మొదట్లో జెస్ట్ కో యాక్టర్స్! ఆ తరువాత ఫ్రెండ్స్‌! ఆ తరువాత బెస్ట్ ఫ్రెండ్స్! అప్పట్లో వైరల్ అయిన వీరి ముద్దు వీడియోతో.. అయిపోయారు సైలెంట్. అంతే కాదు ఒకటి చెబుతూ.. ఇంకోటి చేస్తూ… సోషల్ మీడియాలో పుట్టించేశారు మూమెంట్. ఇక వీరి ఫ్యాన్స్ ఏమో.. వీరి రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ కోసం సెర్చ్‌ చేస్తూనే కూర్చున్నారు పాపం! కాని తాజాగా ఇదే ఫ్యాన్స్‌కు మరో వీడియో నెట్టింట తారసపడడంతో మళ్లీ అయిపోతున్నారు వైరల్.   బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయిన తమన్నా.. ఎట్ ప్రజెంట్ బాలీవుడ్లో లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ చేస్తున్నారు. ఇక అప్పటికే నాని ఎమ్‌ సీఏ సినిమాలో విలన్‌ గా మనకు తెలిసిన విజయ్‌ వర్మ.. అదే సిరీస్‌లో కీ రోల్ చేస్తున్నారు. అలా వీరిద్దరూ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్‌ కరణ్ జోహర్ డైరెక్షన్లో వస్తున్న ఈ సిరీస్ సెట్లోనే కలిశారు. ఆ క్రమంలోనే బాంబే వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించి నెట్టింట లవ్ బర్డ్స్‌ అనే టాక్ వచ్చేలా చేసుకున్నారు.

ఇక దీన్ని కంటిన్యూ చేస్తూనే.. డిసెంబర్ 31స్ట్ వేడుకల్లో వీరిద్దరూ లిప్‌ లాక్ పెట్టుకున్నట్టు కనిపించిన వీడియోతో త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్‌గా మారారు. కానీ ఆ తరువాత రూమర్స్ అండ్ న్యూస్‌ కారణంగా సైలెంట్ అయిపోయారు. మీడియాకు దూరంగా ఉన్నారు.

కానీ ఇన్ని రోజులకు.. ఇప్పుడు ఉన్నట్టుండి! మళ్లీ వీరిద్దరూ ముంబై వీధుల్లో కనిపించారు. ఏదో పార్టీకి వెళ్లి వస్తూ ఫ్లాష్‌ అయ్యారు. ఇక ఈ వీడియోతో ఇప్పుడు నెట్టింట మరో సారి హాట్ టాపిక్‌ గా మారారు. హాట్ టాపిక్‌గా మారడమే కాదు.. అడ్డంగా దొరికిపోయారనే కామెంట్ మళ్లీ వచ్చేలా చేసుకున్నారు తమన్నా.!