Tamanna Bhatia: గ్లామర్ రోల్స్‌కు నో బౌండరీస్.. అయితే ఆ సీన్స్ మాత్రం చేయనంటున్న మిల్క్ బ్యూటీ

ప్రజెంట్ టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సీనియర్ మోస్ట్ హీరోయిన్ తమన్నా భాటియా. 2005లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పటికీ గ్లామర్ హీరోయిన్‌గా తన జోరు చూపిస్తున్నారు. ఎక్కువగా సీనియర్ హీరోల సినిమాల్లోనే కనిపిస్తున్నా... కెరీర్‌ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నారు.

Tamanna Bhatia: గ్లామర్ రోల్స్‌కు నో బౌండరీస్.. అయితే ఆ సీన్స్ మాత్రం చేయనంటున్న మిల్క్ బ్యూటీ
Tamanna Bhatia (File Photo)

Updated on: May 27, 2023 | 3:07 PM

ప్రజెంట్ టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సీనియర్ మోస్ట్ హీరోయిన్ తమన్నా భాటియా. 2005లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పటికీ గ్లామర్ హీరోయిన్‌గా తన జోరు చూపిస్తున్నారు. ఎక్కువగా సీనియర్ హీరోల సినిమాల్లోనే కనిపిస్తున్నా… కెరీర్‌ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నారు. కొద్ది రోజులుగా కాస్త ట్రెండ్ మార్చి లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ ఈ జానర్‌లో డిజిటల్‌లో మంచి సక్సెస్‌లు సాధించి, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద లేడీ ఓరియంటెడ్ మూవీతో సక్సెస్‌ కొట్టేందుకు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో చిరు, రజనీ లాంటి టాప్‌ స్టార్స్‌తో స్క్రీన్‌ షేర్  చేసుకుంటున్నారు.

వెండితెర మీద మోస్ట్ సీనియర్ అయినా… ఇప్పటికీ ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ తమన్నా భాటియా. సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కెరీర్‌ నెట్టుకొస్తున్న ఈ భామ… తెర మీద  కొన్ని సీన్స్‌కు ససేమిరా అంటున్నారు. అదేంటి గ్లామర్ విషయంలో ‘నో బౌండరీస్’ అనే తమన్నా… రిస్ట్రిక్షన్స్‌ పెడుతున్న ఆ సీన్‌ ఏంటి అనుకుంటున్నారా..? రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన తమన్నా… తన మూవీ సెలక్షన్ గురించి ఇంట్రస్టింగ్ కమెంట్స్ చేశారు. తనకు రోలర్‌ కోస్టర్‌ అంటే చాలా భయమన్న మిల్కీ బ్యూటీ… ఆ సీన్ చేయాల్సి వస్తే సినిమా అయినా వదులు కుంటానని చెప్పారు.

ఇవి కూడా చదవండి

తమన్నాలో యాక్టింగ్‌తో పాటు మరో టాలెంట్‌ కూడా ఉందట. టైమ్ దొరికినప్పుడల్లా ఏదో ఒకటి రాయటం ఈ బ్యూటీకి అలవాటు. అయితే ప్రస్తుతానికి టైమ్‌ పాస్‌కు మాత్రమే రాస్తున్నా అంటున్న ఈ బ్యూటీ.. ఫ్యూచర్‌లో ప్రొఫెషనల్ రైటర్‌గా కూడా మారతారేమో చూడాలి..

తమన్నా ఇన్‌స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తలు చదవండి..