Mahesh Babu and Tamanna : మహేష్ బాబుతో మరోసారి మిల్కీబ్యూటీ.. కానీ ఈ సారి ఇలా..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారువారిపాట అనే టైటిల్ తో తరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది

Mahesh Babu and Tamanna : మహేష్ బాబుతో మరోసారి మిల్కీబ్యూటీ.. కానీ ఈ సారి ఇలా..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 07, 2021 | 8:28 AM

Mahesh Babu and Tamanna : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారువారిపాట అనే టైటిల్ తో తరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. దుబాయ్ లో కీలక షడ్యూల్ ను పూర్తి  చేసుకుంది. ఇప్పుడు గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాతర్వాత మహేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నదని పైన క్లారిటీ రాలేదు.

రాజమౌళితో మహేష్ బాబు సినిమా ఉండనుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. జక్కన కూడా సినిమాను కన్ఫామ్ చేసాడు.అయితే ఇటు మహేష్ బిజీగా ఉండటం..అటు రాజమౌళి తన సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మహేష్ తో మిల్కీ బ్యూటీ తమన్నానటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ఆగడు సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా మహేష్ తమన్నా కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయితే ఈ ఇద్దరు మరోసారి కలిసి నటించ బోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే అది సినిమాలో కాదట. ఒక వాణిజ్య ప్రకటన కోసం మహేష్ తమన్నా కలిసి కనిపించనున్నారని తెలుస్తుంది. వాణిజ్య ప్రకటనల పరంగా మహేష్ .. తమన్నా ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తమన్నా ప్రస్తుతం గోపీచంద్ సరసన సీటిమార్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

kangana counter : నువ్వు రేపిస్టుల ఫెమినిస్ట్‌వి.. ఎప్పటికి చీప్ ఆర్టిస్టువే.. తాప్సీపై విరుచుకుపడిన కంగనా..

పులితో ఫొటో దిగడం ఈ మలయాళీ ముద్దుగుమ్మకే సాధ్యం.. విజయ్ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండాలిగా మరీ..