పులితో ఫొటో దిగడం ఈ మలయాళీ ముద్దుగుమ్మకే సాధ్యం.. విజయ్ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండాలిగా మరీ..

Malavika Mohanan : ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా కాస్తంత సమయం దొరికితే ఏం చేస్తారు ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి వెళుతారు.

పులితో ఫొటో దిగడం ఈ మలయాళీ ముద్దుగుమ్మకే సాధ్యం..  విజయ్ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండాలిగా మరీ..
Follow us
uppula Raju

|

Updated on: Mar 06, 2021 | 8:26 PM

Malavika Mohanan : ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా కాస్తంత సమయం దొరికితే ఏం చేస్తారు ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి వెళుతారు. కానీ ఈ మలయాళీ ముద్దుగుమ్మ మాత్రం సమయం దొరికితే అడవుల వెంబడి తిరుగుతుంది. అదేనండీ వైల్డ్‌లైఫ్‌ ఎంజాయ్ చేస్తుందన్నమాట. సరే ఇంతకీ ఆ హారోయిన్ ఎవరో తెలుసా మన మాస్టర్ హీరోయిన్ మాళవిక మోయనన్. తాజాగా ఈ అమ్మడు పులితో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ఒక్క సినిమాతోనే అమ్మడి పేరు బాగానే మార్మోగిపోయింది. దానికి ముందు రజినీకాంత్ హీరోగా వచ్చిన పేటలో కూడా నటించింది మాళవిక. అయితే అందులో పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ఆ తర్వాత మాస్టర్ సినిమాతోనే స్టార్ అయిపోయింది. ఆ సినిమా తర్వాత తెలుగులో కూడా కొన్ని అవకాశాలు వచ్చినా నో చెప్పింది ఈ బ్యూటీ. ముఖ్యంగా రవితేజ లాంటి స్టార్ హీరోకు కూడా నో చెప్పి వార్తల్లో నిలిచింది మాళవిక. ఇప్పుడు హిందీలోనూ డెబ్యూ చేస్తుంది. అక్కడ రెండు సినిమాలకు కమిటైంది మాళవిక మోహనన్. అయితే సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ కు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే తనకు ఖాళీ టైమ్ దొరికిన ప్రతీసారి బయటికి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్యే అడవికి వెళ్లింది ఈ బ్యూటీ.

పులి కనిపించినపుడు కంగారు కూడా ఈమె కళ్ల‌లో లేదు. ఏదో తనకు తెలిసిన వాళ్ల ఇంటికి వచ్చినట్లు.. అడవికి వచ్చి అక్కడ జంతువులతో కలిసిపోయింది మాళవిక. డీప్ ఫారెస్ట్ కి వెళ్లి అక్కడ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఎంజాయ్ చేస్తుంది. ఈ మలయాళీ అమ్మాయి ఎంతో ధైర్యంగా అడవిలో విహరిస్తోంది. ఇలా పులికి దగ్గరగా వెళుతూ కూడా ఎంతో ధైర్యంగా అడుగేసింది. మాళవిక షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. అది బెంగాల్ టైగర్ కదా అంటూ అభిమానులు కింద కామెంట్ చేస్తున్నారు.

Netflix India : ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్ .. ‘స్త్రీ’మింగ్ పేరుతో వైరల్ అవుతున్న వీడియో..

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్