Netflix India : ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్ .. ‘స్త్రీ’మింగ్ పేరుతో వైరల్ అవుతున్న వీడియో..
Netflix India : పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఫిమేల్ క్యారెక్టర్స్‌కు
Netflix India : పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఫిమేల్ క్యారెక్టర్స్‌కు గౌరవమిస్తూ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ‘స్త్రీ’మింగ్ పేరుతో వీడియో షేర్ చేసింది. ‘పిట్టకథలు, లస్ట్ స్టోరీస్, ఢిల్లీ క్రైమ్, షి, ల్యూడో’ లాంటి సిరీస్‌ల క్యారెక్టర్స్‌తో కూడిన యూనిక్ వీడియోను రూపొందించి.. అందులో ఉమెన్ పవర్ అండ్ ఇంపార్టెన్స్, లైఫ్ ఆఫ్ సింపుల్ ఉమెన్ గురించి వివరించింది.
‘మా ప్రతీ కథ కూడా ఆమె గురించే.. తను పర్‌ఫెక్ట్ అండ్ ఇంపర్ఫెక్ట్. సన్‌షైన్, ప్యూర్ మ్యాడ్‌నెస్. తన రిథమ్‌కు తగినట్లుగా ప్రపంచం మొత్తం ఆమెతో డ్యాన్స్ చేస్తుంది. స్టుపిడ్ స్మైల్స్, స్క్రీమింగ్ నైట్స్, డిఫికల్ట్ గుడ్ బైస్ అన్నీ ఎదుర్కొంటుంది. బతకడం తనకో యుద్ధం. తనో రూల్ బ్రేకర్, గేమ్ చేంజర్. కానీ ఆమె జస్ట్ ప్రేమతో కూడిన పలకరింపు కోరుకుంటుంది. మీరు తన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే రండి.. ఆమె ఒక కథ దూరంలో మాత్రమే ఉంది’ అంటూ వీడియోను షేర్ చేసింది ఓటీటీ ప్లాట్‌ఫామ్.
అలాగే .. నెట్ ఫ్లిక్స్ లో వచ్చే ఈ మసాబా మసాబా వెబ్ సిరీస్ నీనా గుప్తా, ఆమె కూతురు ఫ్యాషన్ డిజైనర్ .. ఫ్యాషన్ రంగంలో తమ ఖాతాదారుల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మసాబా చేసే ప్రయత్నాలను ఇందులో చూడవచ్చు. తాను ఎంచుకున్న రంగంలో ఎదురయ్యే సవాల్లను అధిగమిస్తూ.. తానను తాను ఎలా నిరూపించుకుందనేది ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశం.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో తారా ఫ్రమ్ మేడ్ ఇన్ హేవెన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దీనిని ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ శోభితా ధులిపాలా చిత్రీకరించారు. ఇందులోని స్త్రీ ముఖ్యంగా భయంలేకుండా ఉండడం, ప్రాక్టికల్, అనాలోచిత నిర్ణయాలకు దూరంగా ఉంటూంది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సంపూర్ణ సమతుల్యతను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ.. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోంటూ ఏ విధంగా ముందుకు సాగుతుందనేది చూడవచ్చు. సమస్యలను ఎదుర్కోంటున్న ఆమె చివరకు వాటిని ఎలా నెగ్గింది అనేది చూడవచ్చు.
Women (n): There were no words we could find to describe all of them in a dictionary. So here’s to them, and anything they choose to be.#NowStreeming, always streeming. pic.twitter.com/BYguaT1K85
— Netflix India (@NetflixIndia) March 6, 2021