
భారతీయ సినిమా ప్రపంచంలో కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ పన్నూ. తెలుగు, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఓ స్థానం సంపాదించుకుంది. చాలా కాలం పాటు తెలుగులో వరుస సినిమాల్లో నటించిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడే వరుస హిట్స్ అందుకుంటూ బిజీగా ఉండిపోయింది. కానీ పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాలు తగ్గించింది. ఇదెలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. తనకు ఉన్న రింగుల జుట్టు కారణంగా అనేక ఆఫర్స్ కోల్పోయానని.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నానని తెలిపింది. సినిమాల్లో గ్లామర్ అంటే కేవలం జుట్టు నిటారుగా ఉండడమే అనే మూస ధోరణి తనను చాలా బాధించిందని తెలిపింది.
ఇవి కూడా చదవండి : Dhurandhar: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ధురంధర్.. ఈ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో తోపు హీరోయిన్..
కెరీర్ తొలినాళ్లలో ప్రతి దర్శకుడు తన జుట్టు స్ర్టెయిట్ చేయించుకోమని అడిగేవారని తెలిపింది. చాలాకాలం వరకు దర్శకులు గ్లామర్, స్టైలీష్ లుక్ అంటే కేవలం స్ట్రెయిట్ హెయిర్ మాత్రమే అనే ఆలోచనలో ఉన్నారని.. రింగుల జుట్టు అంటే కేవలం రెబల్ రూల్స్ అని భావించారని.. అందుకే రింగుల జుట్టు ఉన్న అమ్మాయి పాజిటివ్ పాత్రలకు పనికిరాదని భావించేవారని తెలిపింది. కెరీర్ మొదట్లో తన హెయిర్ స్ట్రెయిట్ చేయించుకోవడానికి అంగీకరించానని.. కానీ తర్వాత సినిమాలే కాకుండా బ్రాండ్ యాడ్స్ సంస్థలు సైతం తన జుట్టు స్ట్రెయిట్ చేయించుకోవాలని చెప్పడం నచ్చలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి : Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా..
తనకు యాడ్ చేయడానికి చాలా పెద్ద బ్రాండ్స్ ఆసక్తి చూపించాయని.. కానీ రింగుల జుట్టు కాకుండా స్ట్రెయిట్ హెయిర్ కావాలంటే తాను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. అందమైన జుట్టు అంటే రింగుల జుట్టు కాదనే వారి ఆలోచన తనను తీవ్రంగా నిరాశ పరిచాయని తెలిపింది. చిన్నప్పుడు సైతం తాను తన జుట్టును అసహ్యించుకున్నాని.. కానీ ఆ తర్వాత తన జుట్టుపై కెరీ తీసుకున్నట్లు తెలిపింది. తాప్సీ చివరగా హిందీలో అక్షయ్ కుమార్ జోడిగా ఖేల్ ఖేల్ మే చిత్రంలో కనిపించింది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : డీమాన్ దెబ్బకు మారిన ఓటింగ్.. ఆఖరి రోజు ఊహించని రిజల్ట్..
ఇవి కూడా చదవండి : Akhanda 2: అఖండ2లో బాలయ్య కూతురిగా నటించాల్సిన అమ్మాయి ఈమె కాదట.. స్టార్ హీరో కూతురు మిస్సైందిగా..