Taapsee Pannu: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ తాప్సీ. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈ అమ్మడు మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇది ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలతోపాటు తమిళ్ లోనూ నటించి ఆకట్టుకుంది. ఇక ఆతర్వాత బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ ఈ చిన్నదానికి అదిరిపోయే ఆఫర్లు వచ్చాయి. అక్కడ సూపర్ హిట్స్ అందుకుంది ఈ భామ. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది ఈ వయ్యారి. ఇక ఈ అమ్మడు నటించిన మూడు సినిమలో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలయ్యాయి. ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి ఈ సినిమాలు. తప్పడ్, హసీనా దిల్ రుబా.. అనీబెల్లా సేతుపతి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా ఓటీటీలో రాబోతుంది.
జర్మన్ హిట్ చిత్రం ‘రన్ లోలా రన్’ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. లూప్ లపేటా పేరుతో రాబోతుంది ఈ మూవీ. థ్రీల్లర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో తాప్సీ సవిగా లీడ్ రోల్ పోషిస్తుండగా ఇందులో ఆమె ప్రియుడుగా తాహిర్ రాజ్ భాసిన్ కనిపించనున్నాడు. ఫిబ్రవరి 4న ఆమె నటించిన లూప్ లపేటా నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందన్నారు దర్శకుడు ఆకాష్ భాటియా. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :