Vaishali Takkar: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్రెండ్, ప్రముఖ నటి వైశాలి ఠక్కర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్రెండ్, ప్రముఖ సీరియల్ నటి వైశాలి ఠక్కర్‌ మరణం ఇప్పుడు ప్రకపంనలు రేపుతోంది.

Vaishali Takkar: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్రెండ్, ప్రముఖ నటి వైశాలి ఠక్కర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం
Vaishali Takkar Sushant Singh Rajput

Updated on: Oct 16, 2022 | 3:49 PM

ప్రముఖ టీవీ నటి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు వైశాలి ఠక్కర్‌ ఆత్మహత్య టీవీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. చాలా హిందీ సీరియల్స్‌లో నటించిన వైశాలి గత ఏడాది కాలంగా మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో ఉంటున్నారు. తన ఇంట్లో ఉరివేసుకొని వైశాలి ఠక్కర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తేజాజీ నగర్ పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైశాలి నివాసం నుంచి పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే 30 ఏళ్ల వైశాలి ఠక్కర్‌ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయిని వైశాలి ఠక్కర్ స్వస్థలం. వైశాలి టక్కర్ ‘ససురల్ సిమర్ కా’లో అంజలి భరద్వాజ్.. ‘సూపర్ సిస్టర్స్‌’లో శివానీ శర్మ, ‘విషయా అమృత్: సితార’లో నేత్రా సింగ్ రాథోడ్, ‘మన్మోహిని 2’లో అనన్య మిశ్రా లాంటి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్‌లో కూడా పాల్గొంది.

సుశాంత్ చనిపోయినప్పడు వైశాలి పెట్టిన పోస్ట్ దిగువన చూడండి

 

వైశాలి ఠక్కర్‌ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు బెస్ట్ ఫ్రెండ్. అతని మరణంపై అప్పట్లో ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపింది. అతని మరణం వెనుక చాలామంది ప్రమేయం ఉందని ఆరోపించింది. సుశాంత్‌ని మర్డర్ చేశారని.. దీని వెనుక అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి పాటు మరికొందరు ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేసి.. అప్పట్లో సంచలనంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..