Suryadevara Naga Vamsi: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘జెర్సీ’ మూవీ 2019 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారాన్ని గెలుచుకొని సగర్వంగా నిలిచింది. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్‌గా అవార్డును పొందారు. ఈ రెండు పురస్కారాలు తెచ్చిన ఆనందాన్ని ఆస్వాదిస్తూనే.. మార్చి 26న విడుదలవుతున్న ‘రంగ్ దే’ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు నాగవంశీ. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమై ‘జెర్సీ’ సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘జెర్సీ’కి అవార్డులు వస్తాయని ఊహించాం. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది జాతీయ అవార్డులు లేకపోయేసరికి వాటి గురించి మర్చిపోయాం. కానీ ఇప్పుడు హఠాత్తుగా ప్రకటించేసరికి ఆశ్చర్యమూ, ఆనందమూ రెండూ కలిగాయి. తొలిసారి మా సినిమాకు జాతీయ అవార్డులు రావడం సంతోషంగా అనిపిస్తోంది. ఆ సినిమా కోసం హీరో నాని చాలా ఎఫర్ట్ పెట్టారు, బాగా కష్టపడ్డారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పడిన కష్టం కూడా చిన్నదేమీ కాదు” అన్నారు.అలాగే ” గౌతమ్ ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చేసింది. బేసికల్‌గా నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఆ నేపథ్యం ఉన్న కథ కావడం, మంచి భావోద్వేగాలు ఉండటంతో కనెక్టయ్యాను. నానితో ఈ సినిమా చేయాలనుకున్నాడు గౌతమ్. అయితే ఏడు సంవత్సరాల కొడుకు ఉన్న తండ్రి కథని నాని ఒప్పుకుంటారా, లేదా అని సందేహించాం. కానీ వినగానే నాని ఈ కథను నమ్మారు. ఏమాత్రం సందేహించకుండా ఏడేళ్ల కొడుకున్న తండ్రిగా సూపర్బ్‌గా నటించారు” అంటూ చెప్పుకొచ్చారు నాగవంశీ.
మరిన్ని ఇక్కడ చదవండి :
దర్శకేంద్రని ఇంట విషాదం.. ఆర్కే ఫిలిమ్స్ అధినేత కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..
Senior Hero Tarun : మళ్ళీ వెండి తెరపై అడుగు పెట్టడానికి రెడీ అవుతున్న అలనాటి లవర్ బాయ్