Supritha Naidu: జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాం.. సుప్రీత ఎమోషనల్ పోస్ట్

డ్రగ్ పెడ్లర్‌ కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు. గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు నిర్మాత కేపీ చౌదరి. 2023 జూన్‌ 14న డ్రగ్స్‌ కేసులో కేపీ చౌదరి పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ కింగ్‌ పిన్‌, నైజీరియాకు చెందిన డ్రగ్స్‌ పెడ్లర్‌ రాకేష్‌ రోషన్‌తో కేపీ చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు అప్పట్లో ఆరాతీశారు.

Supritha Naidu: జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాం.. సుప్రీత ఎమోషనల్ పోస్ట్
Supritha Naidu
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 03, 2025 | 6:39 PM

గోవాలో నిర్మాత కృష్ణ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం కలకలం రేపింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. డ్రగ్స్ కేసులో చిక్కుకొని వార్తల్లో నిలిచాడు కృష్ణ ప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి నిందితుడుగా ఉన్నాడు. చాలామంది సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లయ్‌ చేసినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే, డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరిని గతంలో రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గోవా నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తూ పోలీసులకు చౌదరి పట్టుపడ్డాడు. గోవా నుంచి 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకు రాగా.. 90 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మారన్న విషయంపై పోలీసుల దర్యాప్తు చేశారు. సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్‌తో డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చాయి

తాజాగా కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకోవడంతో పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సురేఖ వాణి కూతురు సుప్రిత కేపీ చౌదరి మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. “సొసైటీ ఫెయిల్డ్ హియర్ అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పెట్టి పోస్ట్ వేసింది. జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాం అన్నా.. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి.. నీ బాధలు వినడానికి నేను లేకుండా చేశావ్ కదా అన్నా.. ఈ చెల్లి నీకు ఎల్లప్పుడూ అండగానే ఉంటుందన్నా.. ప్లీజ్ త్వరగా తిరిగి రా అన్నా.. మిస్ యూ కేపీ అన్నా.. నువ్వు ఎక్కడున్నా టైగరే అంటావు గా.. నీ ఆత్మకు శాంతి కలగాలి అన్నా”.. అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది సుప్రీత.

సుప్రీత ప్రస్తుతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇటీవలే ఓ సినిమాను కూడా అనౌన్స్ చేసింది. బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడు అమర్ దీప్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూజాకార్యక్రమాలు ఆ మధ్య జరిగాయి. ఆతర్వాత ఇంతవరకు ఆ సినిమా ఊసే లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి