Amrita Rao: ఆయన అన్న ఆ మాటకు రెండు రోజులు ఏడ్చిందట.. ఆసక్తికర విషయం చెప్పిన మహేష్ హీరోయిన్.

|

Feb 25, 2022 | 5:57 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో చాలా మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు నటించారు.. ఆ లిస్ట్ లో ఈ  ముద్దుగుమ్మ ఒకరు.

Amrita Rao: ఆయన అన్న ఆ మాటకు రెండు రోజులు ఏడ్చిందట.. ఆసక్తికర విషయం చెప్పిన మహేష్ హీరోయిన్.
Mahesh Babu , Amrutha Rao
Follow us on

Amrita Rao: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో చాలా మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు నటించారు.. ఆ లిస్ట్ లో ఈ  ముద్దుగుమ్మ ఒకరు. ఆమె పేరే అమృతరావు. ఈ అమ్మడు తెలుగులో చేసిన ఏకైక సినిమా మహేష్ నటించిన అతిథి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అష్ణచైనా స్థాయిలో ప్రేక్షులను ఆకట్టుకోలేక పోయింది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మహేష్ స్టైల్ కు అమృత అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత అమృత టాలీవుడ్ లో సెటిల్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిన్నది బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ పలు సినిమాల్లో నటించిన తర్వాత రేడియో జాకీ అయిన అన్మోల్ సూద్ వివాహమాడి సినిమాలకు దూరమైంది.

సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. నిత్యం తన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అమృత. ఈమద్య కాలంలో ఈ బ్యూటీ యూట్యూబ్ వీడియోలు చేస్తూ సందడి చేస్తోంది. కపుల్ ఆఫ్ థింగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తుంది అమృత. తాజాగా ఫస్ట్ ఫైట్ అనే పేరుతో ఓ వీడియో చేసింది అమృత. ఈ వీడియాలో తన భర్తతో జరిగిన మొదటి గొడవ గురించి ప్రస్తావించింది. పెళ్లికి ముందే ఇద్దరి మద్య గొడవ జరిగినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. అన్మోల్ తో వివాహ నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒక రోజు ఇద్దరి మద్య సినిమాల  గురించి పెద్ద చర్చ జరిగిందట. అన్మోల్ సినిమాలను ఆపేయాలని అన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రేమించిన సినీ కెరీర్ ను ప్రేమించిన వ్యక్తి కోసం త్యాగం చేయాలా అంటూ రెండు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నాను అని చెప్పుకొచ్చింది అమృత. ఆతర్వాత తాను ఏడ్చిన విషయం తెలిసి ఆయన చాలా భాదపడ్డాడని తెలిపింది అమృత రావు .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT Telugu: ‏బిగ్‏బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. ఇక గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ ప్రోమో రిలీజ్..

Poonam Kaur: పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్.. స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ రివ్యూ చెప్పేసిందిగా..

Bheemla Nayak: ఈ టికెట్ ధరలకు మేము సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్స్ క్లోజ్… ఎక్కడంటే..