Mahesh Babu: ‘ఒక్కడు’ ట్రైలర్ కట్ అదిరిపోయింది.. 4k వెర్షన్ చూశారా ?.. మహేష్ ఫ్యాన్స్‏కు ఇక పండగే..

|

Dec 25, 2022 | 9:42 AM

ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాను రిరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన మేకర్స్.. ఈ మూవీ 4కె వెర్షన్ ట్రైలర్ డిసెంబర్ 24న సాయంత్రం విడుదల చేశారు

Mahesh Babu: ఒక్కడు ట్రైలర్ కట్ అదిరిపోయింది.. 4k వెర్షన్ చూశారా ?.. మహేష్ ఫ్యాన్స్‏కు ఇక పండగే..
Okkadu Trailer
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‏లోనే వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ మూవీగా నిలిచింది ఒక్కడు. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇందులో భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఇక ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాను రిరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన మేకర్స్.. ఈ మూవీ 4కె వెర్షన్ ట్రైలర్ డిసెంబర్ 24న సాయంత్రం విడుదల చేశారు. ఆడియోను బూస్ట్ చేసి.. విజువల్ ని 4కె కు మార్చి కట్ చేసిన రెండు నిమిషాల ట్రైలర్ బాగుంది. మహేష్ బాబుకు సంబంధించిన కట్ షాట్స్ ఆకట్టుకున్నాయి. స్పోర్ట్స్, ఫ్యాక్షన్ జానర్ లని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ గుణశేఖర్.

ఇక ఇటీవల రీరిలీజ్ అయిన పోకిరి సినిమా రీ రిలీజ్‌ కాగా ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వచ్చింది. కాగా ఇపుడు అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఒక్కడు కూడా మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుంది. 2023 జనవరి 15కి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇరవై ఏళ్లు అవుతున్న సందర్భంగా ఒక్కడు సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4కె వెర్షన్లలో రిరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పై ఎంఎస్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించాడు. మణిశర్మ అందించిన పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌ హిట్‌ లిస్టులో ఉంటాయి.

ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇందులో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.