Mahesh Babu: క్రేజీ ప్రాజెక్టుకు అంతా సిద్ధం.. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మహేష్‌ బాబు సినిమా.. దర్శకుడు ఎవరంటే.?

Mahesh Babu: టాలీవుడ్‌లో భారీ సినిమాలకు పెట్టింది పేరు గీతా ఆర్ట్స్‌. అత్యంత భారీ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ అల్లు అరవింద్‌ సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యుసర్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్‌ మహేష్‌ బాబు హీరోగా...

Mahesh Babu: క్రేజీ ప్రాజెక్టుకు అంతా సిద్ధం.. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మహేష్‌ బాబు సినిమా.. దర్శకుడు ఎవరంటే.?
Mahesh Babu

Edited By: Phani CH

Updated on: Jul 19, 2021 | 9:47 AM

Mahesh Babu: టాలీవుడ్‌లో భారీ సినిమాలకు పెట్టింది పేరు గీతా ఆర్ట్స్‌. అత్యంత భారీ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ అల్లు అరవింద్‌ సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యుసర్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్‌ మహేష్‌ బాబు హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మహేష్‌ సినిమా కన్ఫామ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్‌ రావిపుడి దర్శకత్వం వహించనున్నాడనేది సదరు వార్త సారాంశం.

అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు సక్సెస్‌ను అందించిన అనిల్‌కు మహేష్‌ మరోసారి అవకాశం ఇవ్వనున్నాడని అప్పట్లోనే వార్తలు వచ్చిన విషయం విధితమే. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్‌ను గీతా ఆర్ట్స్‌ పట్టాలెక్కించే పనిలో పడిందని తాజాగా వినిపిస్తోన్న టాక్‌. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే మహేష్‌ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. ఇక దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమా చేస్తున్నారు. ఈ లెక్కన ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతే ఈ కాంబో పట్టాలెక్కనుందన్నమాట. ఇక మహేష్‌ రాజమౌళితో కూడా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

Also Read: Nabha Natesh: ముక్కోటి వృక్షార్చణ మొక్కలు నాటిన ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్

Monal Gajjar : నెటిజన్ పై సీరియస్ అయిన బిగ్ బాస్ బ్యూటీ.. కారణం ఏంటో తెలుసా..

Pawan Kalyan-Soundarya: మోహన్ బాబు సౌందర్యకు నో చెప్పినా .. బతికిఉండేది అంటున్న కార్తీక దీపం డైరెక్టర్