Superstar Krishna: శ్రీరాముడి పాత్రలో కనిపించిన కృష్ణ.. ఆ సినిమా ఏమిటో తెలుసా..!

|

May 01, 2023 | 11:12 AM

పౌరాణిక, సాంఘిక, కౌబాయ్, జేమ్స్ బాండ్ ఇలా ఏ జోనర్ లో నైనా సూపర్ స్టార్ కృష్ణ నటించి అలరించారు. అయితే కృష్ణ ఫ్యాన్స్ కు కూడా అర్జునుడు, ఏకలవ్యుడు వంటి పౌరాణిక పాత్రలను గుర్తు చేసుకుంటారు కానీ.. శ్రీరాముడిగా కృష్ణ అంటే కొంచెం ఆలోచిస్తారేమో.. అయితే కృష్ణ కూడా శ్రీరాముడిగా వెండి తెరపై క్షణకాలం కనిపించారు. ఆ సినిమా ఏమిటా అని ఆలోచిస్తున్నారా.. 

Superstar Krishna: శ్రీరాముడి పాత్రలో కనిపించిన కృష్ణ.. ఆ సినిమా ఏమిటో తెలుసా..!
Super Star Krishna
Follow us on

కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు.. మానవుడిగా పుట్టి ప్రవర్తనతో దేవుడిగా మారిన శ్రీరాముడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఇక వెండి తెరపై శ్రీరాముడి పాత్రను ఆవిష్కరించిన హీరోలను కూడా దైవంగా భావించి పూజించేవారట అప్పట్లో.. శ్రీరాముడిగా ఎన్టీఆర్, హరినాథ్, శోభన్ బాబు, కాంతారావు, వంటి వారు మాత్రమే కాదు.. నేటి జనరేషన్ కు తెలిసిన బాలకృష్ణతో  జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించారు. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే వెండి తెరపై శ్రీరాముడిగా సూపర్ స్టార్ కృష్ణ కూడా కనిపించారని మీకు తెలుసా..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ఓ సంచలనం. నటుడు, దర్శకుడు, నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశాలి ఘట్టమనేని శివరామకృష్ణ. పౌరాణిక, సాంఘిక, కౌబాయ్, జేమ్స్ బాండ్ ఇలా ఏ జోనర్ లో నైనా సూపర్ స్టార్ కృష్ణ నటించి అలరించారు. అయితే కృష్ణ ఫ్యాన్స్ కు కూడా అర్జునుడు, ఏకలవ్యుడు వంటి పౌరాణిక పాత్రలను గుర్తు చేసుకుంటారు కానీ.. శ్రీరాముడిగా కృష్ణ అంటే కొంచెం ఆలోచిస్తారేమో.. అయితే కృష్ణ కూడా శ్రీరాముడిగా వెండి తెరపై క్షణకాలం కనిపించారు. ఆ సినిమా ఏమిటా అని ఆలోచిస్తున్నారా..

సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో టాప్ టెన్ సినిమాల్లో నిలిచే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తుంది కదా.. 1974 సంవత్సరంలో విడుదలైన అల్లూరి సీతారామరాజు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్. ఈ సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజుగా నటనని ఇప్పటికీ అనేక మంది గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఈ సినిమాలో కృష్ణ శ్రీరాముడిగా కనిపించారు.

ఇవి కూడా చదవండి

అవును అల్లూరి సీతారామరాజు సినిమా క్లైమాక్స్ సన్నివేశం ఎన్నటికీ గుర్తుంది పోతుంది.  సీతారామరాజుని  బ్రిటిష్ ప్రభుత్వపు సైనికులు గుండెకు ఎదురుగా తుపాకీ పెట్టి షూట్ చేసే సమయంలో ధైర్య సాహసాలతో తీక్షణంగా చూస్తూ ఉంటే.. కాల్చడానికి తుపాకీ ఎక్కుపెట్టిన ఒక హిందు సైనికుడికి శ్రీరాముడిగా, క్రైస్తవ సైనికుడికి జీసస్ గా, ముస్లిం సైనికుడికి ఖురాన్ గ్రంథంగా మూడు రకాలుగా కనిపిస్తారు

దీంతో ఈ సైనికులు అల్లూరి సీతారామరాజు కాల్చడానికి వెనకడుగు వేస్తారు. అయితే చివరకు సీతారామరాజుని మేజర్ గుడాల్ కాల్చి చంపుతాడు.

అయితే ఈ సన్నివేశంలో కృష్ణుడు హిందూ సైనికుడికి శ్రీరాముడిగా కనిపిస్తాడు. అలా కృష్ణ ఒక్క క్షణం పాటు అయినా శ్రీరాముడిగా నటించారు అన్నమాట. తన నటనతో అవార్డులను విమర్శకుల ప్రశంసలను అందుకున్న కృష్ణ.. డేరింగ్ డాషింగ్ హీరో అనిపించుకున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.