AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand: ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన గోపీచంద్

ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా మారి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస గా సినిమాలు చేసి మెప్పించారు గోపీచంద్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ యాక్షన్ హీరో ఆ తర్వాత ఫ్లాప్ లను చవిచూడాల్సి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటుకీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో మాత్రం ఫెయిల్ అయ్యాయి.

Gopichand: ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన గోపీచంద్
Gopichand
Rajeev Rayala
|

Updated on: May 01, 2023 | 12:22 PM

Share

హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా మారి మెప్పించారు గోపీచంద్. జయం, వర్షం, నిజం సినిమాలతో తన విలనిజాన్ని చూపి ప్రేక్షకులను మెప్పించారు గోపిచంద్. ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా మారి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస గా సినిమాలు చేసి మెప్పించారు గోపీచంద్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ యాక్షన్ హీరో ఆ తర్వాత ఫ్లాప్ లను చవిచూడాల్సి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటుకీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో మాత్రం ఫెయిల్ అయ్యాయి. అయితే ఎన్ని ఫ్లాప్ లు వచ్చిన గోపీచంద్ మాత్రం సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నారు ఈ టాల్ హీరో. ఇక త్వరలో రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్‌ శ్రీవాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా మే 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజై ప్రేక్షకులని అలరిస్తున్నాయి.

తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ లో మంచి అంచనాలు పెట్టుకుని ఫ్లాపైన సినిమా గౌతమ్ నంద అని తెలిపారు. మంచి కథతో తెరకెక్కిన ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకోలేదని అన్నారు. గౌతమ్ నంద సినిమా మేకింగ్ లో చిన్నచిన్న తప్పులు ఉన్నాయని అయినప్పటికీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందని భావించానని గోపీచంద్ చెప్పుకొచ్చారు.

Follow Us
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!
కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..