Boys Hostel : తెలుగులోకి వచేస్తోన్న లేటెస్ట్‌ కన్నడ బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. ‘బాయ్స్‌ హాస్టల్‌ ‘ విడుదల ఎప్పుడంటే?

|

Aug 13, 2023 | 12:17 AM

ఇప్పుడు మరో సూపర్‌ హిట్‌ సినిమా తెలుగులో రానుంది. హాస్టల్ హుడుగరు బేకాగిద్దరే అనే చిన్న సినిమా ఇటీవల విడుదలై సంచలనం సృష్టించింది. కాలేజీ కుర్రాళ్లు, హాస్టల్లో రోజులు గడిపే సమయంలో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని నితిన్ కృష్ణమూర్తి ఈ మూవీని తెరకెక్కించారు. జులై 21న విడుదలైన ఈ మూవీ అక్కడి యువతను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

Boys Hostel : తెలుగులోకి వచేస్తోన్న లేటెస్ట్‌ కన్నడ బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. బాయ్స్‌ హాస్టల్‌  విడుదల ఎప్పుడంటే?
Boys Hostel
Follow us on

ఒక సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయడం ఇప్పుడు ఆనవాయితీగా వస్తోంది. అలా కన్నడలో విడుదలైన మొదటి సినిమా కాంతారా. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మరో సూపర్‌ హిట్‌ సినిమా తెలుగులో రానుంది. హాస్టల్ హుడుగరు బేకాగిద్దరే అనే చిన్న సినిమా ఇటీవల విడుదలై సంచలనం సృష్టించింది. కాలేజీ కుర్రాళ్లు, హాస్టల్లో రోజులు గడిపే సమయంలో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని నితిన్ కృష్ణమూర్తి ఈ మూవీని తెరకెక్కించారు. జులై 21న విడుదలైన ఈ మూవీ అక్కడి యువతను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సూపర్‌ హిట్‌ సినిమాను ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు.

ఆగస్టు 26న ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ‘బాయ్స్ హాస్టల్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి పోస్టర్‌ను విడుదల చేశారు. చాయ్‌ బిస్కెట్ ఫిల్మ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాయి.

పరమవా పిక్చర్స్ బ్యానర్‌పై పతాకంపై రక్షిత్ శెట్టి సమర్పణలో వచ్చిన హాస్టల్‌ బాయ్స్‌లో కాంతారా ఫేం రిషబ్ శెట్టి, రమ్య అతిథి పాత్రల్లో కనిపించారు. సందడి చేశారు. ఈ సినిమాకు కాంతార, విరూపాక్ష ఫేం అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చారు. త్వరలోనే తెలుగు ట్రైలర్‌తో పాటు ప్రమోషన్‌ ఈవెంట్స్‌ను ప్లాన్‌ చేసే యోచనలో ఉన్న మేకర్స్‌. మరి కన్నడలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.